అవిశ్వాస తీర్మానాలను చదివిన లోక్సభ స్పీకర్ | Three No-trust notices against UPA government: Meira Kumar | Sakshi
Sakshi News home page

అవిశ్వాస తీర్మానాలను చదివిన లోక్సభ స్పీకర్

Dec 11 2013 12:26 PM | Updated on Mar 9 2019 3:08 PM

అవిశ్వాస తీర్మానాలను చదివిన లోక్సభ స్పీకర్ - Sakshi

అవిశ్వాస తీర్మానాలను చదివిన లోక్సభ స్పీకర్

యూపీఏ ప్రభుత్వంపై సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను లోక్సభలో స్పీకర్ మీరా కుమార్ చదివి వినిపించారు.

న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వంపై సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను లోక్సభలో స్పీకర్ మీరా కుమార్ చదివి వినిపించారు. వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కాంగ్రెస్‌ ఎంపీ రాయపాటి సాంబశివరావు అవిశ్వాస నోటీసులిచ్చారని సభలో చెప్పారు. మూడు అవిశ్వాస నోటీసులొచ్చాయని తెలిపారు.

సభ సజావుగా సాగితేనే నోటీసులను సభ ముందుంచుతానని స్పీకర్ అన్నారు. ఈ సమయంలో సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల పోటీపోటా నినాదాలతో గందరగోళం తలెత్తింది. దీంతో లోక్సభను రేపటికి వాయిదా వేశారు. అయితే అవిశ్వాస తీర్మానాలపై సభలో చర్చ జరగకుండా చూసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీమాంధ్ర ఎంపీలు ఆరోపిస్తున్నారు. మరోవైపు నోటీసులిచ్చిన సీమాంధ్ర ఎంపీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామంటూ వారిని దారిని తెచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. అటు రాజ్యసభలోనూ సమైక్య నినాదాలు మార్మోగాయి. దీంతో రాజ్యసభ రెండుసార్లు వాయిదా పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement