టెకీ రేప్-హత్య కేసులో ఆ ముగ్గురూ దోషులే | Three convicted in 2009 Pune techie rape-cum-murder case | Sakshi
Sakshi News home page

టెకీ రేప్-హత్య కేసులో ఆ ముగ్గురూ దోషులే

May 8 2017 8:23 PM | Updated on Jul 28 2018 8:40 PM

టెకీ రేప్-హత్య కేసులో ఆ ముగ్గురూ దోషులే - Sakshi

టెకీ రేప్-హత్య కేసులో ఆ ముగ్గురూ దోషులే

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హతమార్చిన కేసులో ముగ్గురు నిందితులను కోర్టు దోషులుగా తేల్చింది.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హతమార్చిన కేసులో ముగ్గురు నిందితులను కోర్టు దోషులుగా తేల్చింది. నయనా పూజారి (28) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై 2009 నాటి అత్యాచారం - హత్య కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదమ్ అనే ముగ్గురు దోషులేనని స్పెషల్ జడ్జి ఎల్ఎల్ యెంకర్ తేల్చారు. ఈ కేసులో ఉన్న మరో నిందితుడు ఆ తర్వాత అప్రూవర్‌గా మారాడు. దాంతో ముగ్గురు దోషులకు ఏ శిక్ష విధించాలన్న విషయమై వాదనలను కోర్టు మంగళవారం వింటుంది. ఈ ముగ్గురిపై కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య, ఒకే రకమైన ఉద్దేశంతో నేరపూరిత కుట్రకు పాల్పడి ఆస్తులు దుర్వినియోగం చేయడం లాంటి నేరాలు నిరూపితమయ్యాయి. హత్య చేయాలన్న ఉద్దేశంతో అపహరించడం, దోపిడీ చేసే సమయంలో గాయపర్చడం, సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేయడం అనే ఆరోపణలు మాత్రం ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యం చూపించకపోవడంతో నిరూపితం కాలేదు.

ఖరాడి ప్రాంతంలోని ఒక ఐటీ సంస్థలో పనిచేసే నయనా పూజారి 2009 అక్టోబర్ 7న ఆఫీసు నుంచి తిరిగి రావడానికి వేచి చూస్తుండగా కిడ్నాప్ అయింది. రెండు రోజుల తర్వాత పుణె జిల్లా ఖేడ్ తహసీల్‌లోని జరేవాడీ అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం బయటపడింది. బాధితురాలిని కిడ్నాప్ చేసిన తర్వాత ఒక కారులో ఆమెపై అత్యాచారం చేశారని ప్రాసిక్యూషన్ వర్గాలు తెలిపాయి. ఆమె వద్ద ఏటీఎం కార్డు తీసుకుని డబ్బులు దొంగిలించారని, తర్వాత పీక పిసికి చంపేసి అడవిలో పారేశారని అన్నారు. ఈ కేసులో దోషులు ముగ్గురితో పాటు ఉన్న మరో నిందితుడు రాజేష్ చౌదరి ఆ తర్వాత అప్రూవర్‌గా మారాడు. ఇది అత్యంత అరుదైన కేసు కాబట్టి ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించాలనే అడుగుతామని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది హర్షద్ నింబాల్కర్ తెలిపారు. నయనా పూజారి ఘటన తర్వాతే ఐటీ, బీపీఓ రంగాల్లో పనిచేసే మహిళలకు భద్రత కరువైన అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement