జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మంగళవారం మూడో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
శ్రీనగర్/రాంచీ: జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల్లో మంగళవారం మూడో విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కశ్మీర్‌లో ఈ విడతలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతోపాటు ముగ్గురు కేబినెట్ మంత్రులు బరిలో ఉన్నారు. బద్గామ్, పుల్వామా, బారాముల్లా జిల్లాల్లోని 16 సీట్లకు మూడో విడతలో పోలింగ్ జరగనుంది. మొత్తం 144 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.
శుక్రవారం కశ్మీర్‌లో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన నేపథ్యంలో భద్రత సమస్యలు లేకుండా భద్రతా దళాలను మోహరించారు. ఒమర్ తమ కుటుంబం ఎప్పుడూ పోటీచేసే గందర్‌బాల్ ీనుంచి కాకుండా ఈ సారి బీర్‌వా స్థానం నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం.
జార్ఖండ్‌లో 17 సీట్లకు...
జార్ఖండ్‌లె మూడో దశలో 17 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఐదు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బరిలో 289 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇందులో 103 మంది స్వతంత్ర అభ్యర్థులే కావడం విశేషం. మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ, ముగ్గురు మంత్రులు ఈ దశలో పోటీకి దిగుతున్నారు.