బ్రిటన్ విమానాశ్రయాలకు ఉగ్రవాదుల ముప్పు, హైఅలర్ట్! | Terror threat: British airports put on alert | Sakshi
Sakshi News home page

బ్రిటన్ విమానాశ్రయాలకు ఉగ్రవాదుల ముప్పు, హైఅలర్ట్!

Jul 3 2014 8:17 PM | Updated on Sep 2 2017 9:46 AM

ఉగ్రవాదుల ముప్పుందనే వార్తలతో బ్రిటన్ విమానాశ్రయాల్లో గురువారం హైఅలర్ట్ ప్రకటించారు.

లండన్: ఉగ్రవాదుల ముప్పుందనే వార్తలతో బ్రిటన్ విమానాశ్రయాల్లో గురువారం హైఅలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదులు గుర్తించడానికి వీలులేని, తనిఖీల్లో బయటపకుండా కొత్త రకం బాంబులను విమానాల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం మేరకు బ్రిటన్ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 
 
సిరియాలో మిలిటెంట్లు పరీక్షించిన కొత్త రకం బాంబులను రెండు ఉగ్రవాద సంస్థలు విమానాల్లో పెట్టడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం అందిందని.. అందుకే గట్టి భద్రతలు తీసుకున్నామని మీడియాకు వెల్లడించారు. తనిఖీ పరికరాలకు చిక్కకుండా టెర్రరిస్తులు తమ దేహాల్లో కొత్త రకం బాంబులను అమర్చుకుంటున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయని అధికారులు తెలిపారు. 
 
బ్రిటన్ పౌరులకు హాని కలిగించేదుకు ఉగ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు అందాయని, అందుకే ఉగ్రవాదులు ప్రయత్నాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement