'నా కూతురు బారిస్టర్' | Sushma Swaraj Hits Back at Tweet on Daughter | Sakshi
Sakshi News home page

'నా కూతురు బారిస్టర్'

Jun 18 2015 9:24 AM | Updated on Sep 3 2017 3:57 AM

'నా కూతురు బారిస్టర్'

'నా కూతురు బారిస్టర్'

తన కుమార్తెకు ఈశాన్య కోటాలో మెడికల్ ఇప్పించుకున్నారని వచ్చిన ట్వీటుపై సుష్మా స్వరాజ్ మండిపడ్డారు.

న్యూఢిల్లీ: లలిత్ మోదీ వివాదంలో చిక్కుకున్న విదేశీ వ్యవహారాల శాఖ సుష్మా స్వరాజ్ ఇంటా బయట విమర్శలు ఎదుర్కొంటున్నారు. సుష్మ కుటుంబం మొత్తం లలిత్ మోదీ సేవలో తరించిందన్న ఆరోపణల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెపై నెటిజన్లు విమర్శులు గుప్పిస్తున్నారు. తన కుమార్తెకు ఈశాన్య కోటాలో మెడికల్ సీటు ఇప్పించుకున్నారని వచ్చిన ట్వీటుపై సుష్మ మండిపడ్డారు.

'నా కూతురు బారిస్టర్. ఆక్స్ ఫర్డ్ గ్రాడ్యుయేట్. ఎందుకు అబద్దాలు చెబుతారు' అంటూ సదరు ట్వీటుకు బదులిచ్చారు. సుష్మ ఘాటుగా సమాధానం ఇవ్వడంతో సదరు ట్విటర్ ఖాతాను తొలగించారు. అయితే ఇటువంటి వాటికి స్పందించి సమయం వృధా చేసుకోవద్దని సుష్మ మద్దతుదారులు ఆమెకు సలహా యిచ్చారు. న్యాయవాదిగా పనిచేస్తున్న సుష్మ తనయ బాసురి.. లలిత్ మోదీ పాస్ పోర్టు రద్దు వ్యవహారంలో ఆయన తరపు వాదించినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement