తెలంగాణ బిల్లు చర్చకు వస్తుందో రాదో చెప్పలేం: షిండే | Sushil Kumar Shinde uncertain about debate on Telangana Bill in Cabinet Meeting | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిల్లు చర్చకు వస్తుందో రాదో చెప్పలేం: షిండే

Nov 14 2013 4:32 PM | Updated on Jul 29 2019 5:31 PM

తెలంగాణ బిల్లు చర్చకు వస్తుందో రాదో చెప్పలేం: షిండే - Sakshi

తెలంగాణ బిల్లు చర్చకు వస్తుందో రాదో చెప్పలేం: షిండే

రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం)తో నవంబర్ 18న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం అవుతారు అని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు.

రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం)తో నవంబర్ 18న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమావేశం అవుతారు అని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. హైదరాబాద్ లో బాలల చలన చిత్రోత్సవాలు జరుగుతున్న కారణంగానే జీవోఎంతో కిరణ్ కుమార్ రెడ్డి భేటి కాలేకపోయారని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
వచ్చే కేబినెట్ సమావేశంలో తెలంగాణ బిల్లు గురించి చర్చకు వస్తుందో లేదో తాను ఇప్పుడే చెప్పలేను అని షిండే మరో ప్రశ్నకు జవాబిచ్చారు. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తప్పకుండా తెలంగాణ బిల్లును ప్రవేశ పెడుతాం అని అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ జీవోఎంతో కిరణ్ కుమార్ రెడ్డి హాజరుకాకపోవడంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు జవాబుగా వివరణ ఇచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement