రతన్టాటాపై విరుచుకుపడ్డ స్వామి | Subramanian Swamy writes to PM Modi, seeks SIT probe against Ratan Tata | Sakshi
Sakshi News home page

రతన్టాటాపై విరుచుకుపడ్డ స్వామి

Oct 28 2016 6:36 PM | Updated on Nov 6 2018 4:42 PM

రతన్టాటాపై విరుచుకుపడ్డ స్వామి - Sakshi

రతన్టాటాపై విరుచుకుపడ్డ స్వామి

ఓ వైపు రతన్ టాటాపై, అర్థాంతరంగా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా... ఏ వివాదానికైనా తాను స్పందించాల్సిందేనని భావించే బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యస్వామి కూడా రతన్ టాటాపై విరుచుకుపడ్డారు.

న్యూఢిల్లీ : ఓ వైపు రతన్ టాటాపై, అర్థాంతరంగా చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా... ఏ వివాదానికైనా తాను స్పందించాల్సిందేనని భావించే బీజేపీ ఫైర్ బ్రాండ్ సుబ్రహ్మణ్యస్వామి కూడా రతన్ టాటాపై విరుచుకుపడ్డారు. మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ప్రముఖ పారిశ్రామికవేత్తపై స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్(సిట్)తో విచారణ జరిపించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాశారు.  ఈ లేఖలో రతన్ టాటా నాలుగు క్రిమినల్ నేరాలకు పాల్పడినట్టు  వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. ఆయన్ను రక్షించడానికి ప్రభుత్వ జోక్యం అవసరం లేకుండా ఈ విచారణ జరిపించాలన్నారు. భారత పార్టనర్గా ఎయిర్ఏషియా, విస్తారా ఎయిర్లైన్స్లో నిబంధనలు ఉల్లంఘించి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపించారు.
 
దీనికి టాటా గ్రూప్ చైర్మన్ నుంచి అర్థంతరంగా ఉద్వాసన పలికిన సైరస్ మిస్త్రీ బయట పెట్టిన విషయాలే సాక్ష్యమని పేర్కొన్నారు. నాలుగు క్రిమినల్ కేసులను రతన్ టాటాఎదుర్కోవాల్సి ఉంటుందని స్వామి తెలిపారు. నమ్మకానికి భంగం, దుర్వినియోగ నేరం, మనీలాండరింగ్, కంపెనీ చట్టాల ఉల్లంఘనల కింద ఆయనపై కేసులు నమోదుచేయాలని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు . సిట్ విచారణలో సీబీఐ, సెబీ, ఎన్ఫోర్స్మెంట్ సభ్యులుండాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వ జోక్యాన్ని నివారించవచ్చన్నారు. అసలు రతన్ టాటా, టాటాలకు చెందినవారు కాదని, అతన్ని అనాథశ్రయం నుంచి రతన్ టాటా తండ్రి నావల్ తెచ్చిపెంచుకున్నారన్నారు. తనపై వేటు వెనుక మిస్టరీపై మిస్త్రీ చేస్తున్న విమర్శలు ఇప్పటికే రతన్ టాటా పరువును వీధికీడుస్తుండగా..స్వామి సైతం వివాదాస్పదవ్యాఖ్యలు చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement