‘శ్రీ సత్య సీడ్స్’కు అంతర్జాతీయ పురస్కారం | "Sri Sathya Seeds' to the international award | Sakshi
Sakshi News home page

‘శ్రీ సత్య సీడ్స్’కు అంతర్జాతీయ పురస్కారం

Oct 5 2015 2:04 AM | Updated on Sep 3 2017 10:26 AM

‘శ్రీ సత్య సీడ్స్’కు అంతర్జాతీయ పురస్కారం

‘శ్రీ సత్య సీడ్స్’కు అంతర్జాతీయ పురస్కారం

విత్తన ఉత్పత్తి రంగంలో విశిష్ట ప్రతిభ కనబరచినందుకు గానూ శ్రీ సత్య సీడ్స్ కంపెనీ ‘వేగంగా పురోగతి సాధిస్తున్న భారతీయ ....

హైదరాబాద్: విత్తన ఉత్పత్తి రంగంలో విశిష్ట ప్రతిభ కనబరచినందుకు గానూ శ్రీ సత్య సీడ్స్ కంపెనీ ‘వేగంగా పురోగతి సాధిస్తున్న భారతీయ కంపెనీ ఎక్సలెన్స్ అవార్డు’ను కైవసం చేసుకుంది. ఇటీవల బ్యాంకాక్‌లో ఏడవ అంతర్జాతీయ విజయ సాధకుల సదస్సు జరిగింది. ఇందులో పలు రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన వివిధ దేశాల సంస్థలకు పురస్కారాలను అందిచారు.

ఇందులో భాగంగా శ్రీ సత్య సీడ్స్ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ కొసనా రామకోటేశ్వరరావు థాయ్‌లాండ్ దేశ మాజీ ఉప ప్రధాని హెచ్.ఈ. ఖూన్ కోర్న్ దబ్బరాన్సి చేతుల మీదుగా ఎక్స్‌లెన్స్ అవార్డును అందుకున్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement