ప్రేమించలేదని కారుతో గుద్దేశాడు.. | Spurned lover rams car into girl Thrissur | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని కారుతో గుద్దేశాడు..

Apr 15 2015 2:01 PM | Updated on Sep 3 2017 12:20 AM

ప్రేమించలేదని కారుతో గుద్దేశాడు..

ప్రేమించలేదని కారుతో గుద్దేశాడు..

సంవత్సర కాలంగా వెంటపడుతున్నా పట్టించుకోవడం లేదనే అక్కసుతో 22 సంవత్సరాల అమ్మాయిపై కారును ఎక్కించాడో దుర్మార్గుడు.

కొచ్చి: కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో  దారుణం జరిగింది.  సంవత్సర కాలంగా వెంటపడుతున్నా  పట్టించుకోవడం లేదనే అక్కసుతో  22  సంవత్సరాల అమ్మాయిపై కారును  ఎక్కించాడో  దుర్మార్గుడు. బీకాం రెండవ సంవత్సరం చదువుతున్న అమ్మాయిపై 21 ఏళ్ల  షెబీన్  ఈ దాడికి  తెగబడ్డాడు.  అరింబూర్ లోని గుడి కెళ్ళి  తిరిగి వస్తున్న  ఆమెపై కారుతో ఎటాక్ చేశాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.  

అంతేకాదు ఆమె సహాయం చేసేందుకు ప్రయత్నించిన మరో ఐదుగురిపై కూడా కారు ఎక్కించాడు.  కారు రివర్స్  చేసుకొని వచ్చిమరీ వారిని కారుతో గుద్ది తీవ్రంగా  గాయపర్చాడు.  వీరిలో  ఒకరు వెంటలేటిర్పై చికిత్స తీసుకుంటుండగా,  మరో వ్యక్తి ఐసీయూ లో ఉన్నారు.  సంఘటన అనంతరం నిందితుడు  షెబీన్ తల్లితండ్రులతో సహా పరారయ్యాడు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement