పెళ్లి వద్దందని.. ప్రియురాలిని నరికేశాడు | Spurned lover axes teenage girl to death | Sakshi
Sakshi News home page

పెళ్లి వద్దందని.. ప్రియురాలిని నరికేశాడు

Nov 1 2016 11:55 AM | Updated on Sep 4 2017 6:53 PM

పెళ్లి వద్దందని.. ప్రియురాలిని నరికేశాడు

పెళ్లి వద్దందని.. ప్రియురాలిని నరికేశాడు

తాను ఎంతగానో ప్రేమిస్తున్న ప్రియురాలు.. తనను పెళ్లి చేసుకోడానికి నిరాకరించడంతో తీవ్రంగా నిరాశ చెందిన ప్రేమికుడు.. ఆమెను గొడ్డలితో నరికి చంపేశాడు.

తాను ఎంతగానో ప్రేమిస్తున్న ప్రియురాలు.. తనను పెళ్లి చేసుకోడానికి నిరాకరించడంతో తీవ్రంగా నిరాశ చెందిన ప్రేమికుడు.. ఆమెను గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతమైన జవహర్ తాలూకాలో జరిగింది. నిందితుడు నీలేష్ ఖార్పడా (19) గత కొన్నాళ్లుగా 14 ఏళ్ల అమ్మాయితో ప్రేమలో ఉన్నాడు. వీళ్లిద్దరూ చాలాకాలంగా ప్రేమించుకుంటున్నారని, దాంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని.. కానీ ఆమె అతడి ప్రతిపాదనను తిరస్కరించిందని పోలీసులు తెలిపారు. 
 
వీళ్లిద్దరూ కూడా ఇదే తాలూకాలోని తిలోండా అనే గ్రామానికి చెందినవారు. బాధితురాలు ఖర్వాడా గ్రామం వ్దద ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనక నుంచి వచ్చిన ప్రేమికుడు ఆమెను గొడ్డలితో నరికేశాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి పంపారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement