లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఫిబ్రవరి 22న భేటీ కానున్నారని బుధవారం పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి.
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఫిబ్రవరి 22న భేటీ కానున్నారని బుధవారం పార్లమెంటు వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ఈ సందర్భంగా ఆమె వారికి విజ్ఞప్తి చేయనున్నారని తెలిపాయి.
ఈ సమావేశాల్లో కేంద్రం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ(రెండో సవరణ) బిల్లు సహా పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 26న రైల్వే బడ్జెట్, 27న ఎకనమిక్ సర్వే, 28న బడ్జెట్‌ను ప్రవేశపెడ్తారు. సమావేశాలు మే 8తో ముగుస్తాయి.