ఈ కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ అమెరికాలో ఐపీఓకు రానుంది. దీని ద్వారా 500-600 కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: ఈ కామర్స్ కంపెనీ స్నాప్‌డీల్ అమెరికాలో ఐపీఓకు రానుంది. దీని ద్వారా 500-600 కోట్ల డాలర్లు సమీకరించనున్నట్లు సమాచారం. దీనికోసం మర్చంట్ బ్యాంకర్లను నియమించినట్లు స్నాప్‌డీల్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఐపీఓ 2016-17లో రావచ్చని అంచనా. ఈ కంపెనీలో రతన్ టాటా, విప్రో అజిమ్ ప్రేమ్‌జీల పెట్టుబడులు కూడా ఉన్నాయి.