పక్కకు పడుకుంటే మతిమరుపు దూరం | Sakshi
Sakshi News home page

పక్కకు పడుకుంటే మతిమరుపు దూరం

Published Mon, Aug 10 2015 8:17 PM

home

న్యూయార్క్: మీరు వెల్లకిలాగాని, బోర్లాగాని పడుకుంటున్నారా..అయితే మీరు పడుకునే విధానం మార్చుకుని పక్కకు పడుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే..పక్కకు పడుకొనేవారిలో అల్జీమర్స్ (మతిమరుపు), పార్కిన్సన్ (వణుకురోగం)తోపాటు నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం తక్కువని తాజా అధ్యయనంలో తేలింది.

పక్కకు పడుకోవడంవల్ల మెదడులోని వ్యర్థ, హానికారక రసాయనాలు చాలావరకూ తొలగిపోతాయి. ఇలాంటి వ్యర్థ రసాయనాలే అల్జీమర్స్‌తో పాటు నరాల వ్యాధులకు కారణమౌతాయి. పక్కకు పడుకునేవారి మెదడు సంబంధిత గ్లింపటిక్ పాత్‌వేను ఎమ్‌ఆర్‌ఐ స్కాన్ చేయగా ఈ సంక్లిష్ట వ్యవస్థ వ్యర్థాలను శుభ్రపరుస్తున్నట్లు తేలింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement