parkinson
-
నాన్న ఉన్నట్టుండి పడిపోతున్నారా?, అయితే..
ఆరు పదుల వయసు దాటిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు?, ఎలా ఉంటున్నారు? అనేది పిల్లలు గమనించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా అంతకుముందు చురుగ్గా తిరిగిన తండ్రి.. ఇప్పుడు ఉన్నట్టుండి డల్‌గా మారిపోవడం, శరీరం అంతా బిగుసుకుని ఉండిపోవడం, ఎక్కువగా నడవలేకపోవడం, ఒకవేళ నడిచినా పడిపోతుండడం లాంటి లక్షణాలు కనపడితే, అది కేవలం వయసు ప్రభావం మాత్రమే కాదు.. పార్కిన్సన్స్ డిసీజ్ కావచ్చు. పై లక్షణాలు కనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే న్యూరాలజిస్టును సంప్రదించాలి. తగిన పరీక్షల ద్వారా దానికి కారణాలేంటో తెలుసుకుని తక్షణం చికిత్స ప్రారంభిస్తే లక్షణాలు తగ్గడమే కాదు, కొన్ని కేసుల్లో పూర్తిగా నయం అయిపోతుంది కూడా! మెదడులో ఉండే డొపమైన్ అనే రసాయనం ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల వచ్చే పార్కిన్సన్స్ వ్యాధి గురించి సామాన్య ప్రజల్లో కూడా అవగాహన ముఖ్యమని.. దాని లక్షణాలను గమనించి వెంటనే చికిత్స చేయించడం అవసరమని నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్, స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్ తెలిపారు. ఈ నెల 11న ప్రపంచ పార్కిన్సన్స్ డే(World Parkinson's Day) సందర్భంగా ఆయన మాట్లాడారు.“మన శరీరంలో ఇన్సులిన్ తగ్గితే మధుమేహం ఎలా వస్తుందో... అలాగే డొపమైన్ తగ్గితే పార్కిన్సన్స్ వస్తుంది. సాధారణంగా ఇది 60 ఏళ్లు దాటినవారిలోనే కనిపిస్తుంది గానీ, ఇటీవల కొన్ని కేసుల్లో మాత్రం 20లలో ఉన్నవారికి కూడా చూస్తున్నాం. ఇతర వ్యాధుల్లా కాకుండా.. శారీరకంగా కనిపించే లక్షణాలను బట్టే దీన్ని గుర్తించేందుకు కొంతవరకు అవకాశం ఉంటుంది. 👉ఎక్కువగా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడం, గతంతో పోలిస్తే బాగా డల్‌గా ఉండడం, ముఖంలో ఎలాంటి హావభావాలు పలికించకపోవడం, శరీరం అంతా బిగుతుగా అయిపోవడం, చేతులు కొద్దిగా వణకడం, చేత్తో ఏవీ సరిగ్గా పట్టుకోలేకపోవడం, నడక తగ్గిపోవడం, నడుస్తుంటే పడిపోవడం... ఇలాంటివన్నీ కూడా పార్కిన్సన్స్ వ్యాధి లక్షణాలే. వీటిలో ఏవి కనిపించినా కూడా అవతలివాళ్లు వెంటనే గుర్తించగలరు. 👉అలా గుర్తించినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో.. కుటుంబంలో ఏదైనా మరణం సంభవించడం వల్ల కుంగుబాటు (డిప్రెషన్)తో అలా అయిపోయారని, కొన్ని రోజులు పోతే అదే నయమైపోతుందని వదిలేయకుండా వెంటనే వైద్యులకు చూపించాలి. చూపించినప్పుడు ఆ సమస్య మానసికమా, శారీరకమా అన్నది గుర్తించి అందుకు తగిన చికిత్సలు అందిస్తారు.👉గతంలో పార్కిన్సన్స్ డిసీజ్ (పీడీ) వచ్చిందంటే దానికి ప్రధానంగా డీబీఎస్ (డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్) లాంటి శస్త్రచికిత్సలే ఉండేవి. లేదంటే శరీరంలో డొపమైన్ స్థాయిని పెంచేందుకు కొన్ని రకాల మందులు వాడేవారు. కానీ ఇప్పుడు వైద్యశాస్త్రం అభివృద్ధి చెందింది. పార్కిన్సన్స్ వ్యాధికి కారణాలు ఏంటో తెలుసుకుని అందుకు తగిన చికిత్స చేసేందుకు అవకాశం వచ్చింది. ఇటీవల నా దగ్గరకు ఒక రోగి వచ్చారు. ఆయనకు పార్కిన్సన్స్ లక్షణాలే ఉన్నాయి. పరీక్షించినప్పుడు యాంటీబాడీలు తయారవ్వడం వల్ల డొపమైన్ స్థాయి తగ్గుతోందని గుర్తించాం. దాంతో ఇమ్యునోథెరపీ ప్రారంభిస్తే చాలా తక్కువ సమయంలోనే ఆయనకు పూర్తిగా నయమైంది. ఇప్పుడు మామూలు మనిషిలా ఉన్నారు. అందువల్ల సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకొస్తే, పార్కిన్సన్స్ వ్యాధిని కూడా పూర్తిగా నయం చేసేందుకు కొన్ని కేసుల్లో అవకాశం ఉంటుంది. అదే ఇంతకుముందయితే జీవితాంతం డొపమైన్ పెంచేందుకు ఉపయోగపడే మందులు వాడుతూ ఉండాల్సి వచ్చేది, లేదా డీబీఎస్ లాంటి శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చేది. కొన్ని రకాల ఆహారపు అలవాట్ల వల్ల కూడా శరీరంలో కణాలు చచ్చిపోతాయి. అందువల్ల కూడా డొపమైన్ ఉత్పత్తి తగ్గిపోయి ఈ సమస్య వస్తుంది. అందువల్ల.. ప్యాకేజ్డ్, ప్రాసెస్డ్ ఆహారం తీసుకోవడం వీలైనంత వరకు తగ్గించాలి. అలాగే రసాయనాలకు గురికావడాన్ని కూడా తగ్గించాలి. అలాగే ఎంత త్వరగా ఈ లక్షణాలు గుర్తిస్తే అంత త్వరగా వైద్యులకు చూపించి, త్వరగా చికిత్స చేయడం మొదలుపెడితే ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి. చురుకైన జీవనశైలిని పాటించడం, మంచి ఆహారం తీసుకోవడం, నిత్యం క్రమం తప్పకుండా వ్యాయామం చేసుకోవడం ద్వారా కొంతవరకు ఈ వ్యాధి రాకుండా నిరోధించుకోవచ్చు” అని డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్ వివరించారు.డాక్టర్ అనిరుధ్ రావు దేశ్‌ముఖ్,ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రి కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్,స్ట్రోక్ స్పెషలిస్ట్ -
మామయ్య ప్రవర్తనలో మార్పు వచ్చింది
మా మామయ్యకు 65 ఏళ్లు. ఆయనకు బీపీ, షుగర్ చాలా కాలంగా ఉన్నాయి. సంవత్సరం క్రితం పార్కిన్సన్’ జబ్బు వచ్చిందని చెప్పారు. ఇక్కడే నరాల డాక్టర్‌కి చూపిస్తున్నాం. కొన్ని రోజులుగా ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. మా అత్త గారిని విపరీతంగా అనుమానిస్తున్నారు. ఇంటికి ఎవరైనా మగవాళ్ళు వస్తే వాళ్ళకి, మా అత్తగారితో అక్రమ సంబంధం అంటగడుతున్నారు. అలాగే రాత్రుళ్ళు ప్రశాంతంగా నిద్రపోకుండా మధ్యలో లేచి బయటకు, ఇంట్లోకి తిరుగుతున్నారు. మాకు ఎవరికీ కనపడని మనుషులు ఆయనకు కనపడుతున్నారు. ఈమధ్య అనుమానం నా మీద కూడా మొదలైంది. ఇంట్లో ఆడవాళ్ళని బయటకు వెళ్ళనీయట్లేదు. మా ఆయనకి చెప్తే వాళ్ళ నాన్నను మందలించడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆయన ప్రవర్తనతో, మాటలతో మాకు నరకం కనిపిస్తోంది. – భానుప్రియ, మదనపల్లెమీరు రాసిన దాన్ని బట్టి మీ మామ గారికి గతంలో ఎప్పుడూ మానసిక సమస్యలు లేవు, బీపీ, షుగర్ మాత్రమే ఉన్నాయి, ఈ మధ్యే పార్కిన్సన్’ జబ్బు వచ్చిందని తెలుస్తోంది. మెదడులో ‘డోపమైన్’ అనే రసాయనం స్థాయి తగ్గినప్పుడు పార్కిన్సన్ జబ్బు, అదే డోపమైన్ పెరిగినపుడు ‘సైకోసిస్’ జబ్బు వస్తుంది. పార్కిన్సన్ జబ్బులో డోపమైన్ రసాయనం స్థాయి తగ్గడం వల్ల చేతులు వణకడం, నిదానంగా నడవడం, శరీరంలో కదలికలు తగ్గడం లాంటివి జరుగుతాయి. మందులు వాడినపుడు డోపమైన్ లెవల్స్ పెరిగి వారిలో ఈ లక్షణాలు మెరుగవుతాయి. ఐతే ఇలా మందులు వాడే వారిలో కొందరికి అనుమానాలు, భ్రాంతులు వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనపడతాయి. దీనికి ప్రధాన కారణం డోపమైన్ లెవెల్స్ అవసరానికి మించి పెరగడం. మీ మామ గారి విషయంలో జరిగింది కూడా ఇదే! కనుక ముందు మీ న్యూరాలజిస్ట్‌ని కలిసి మందులు తగ్గిస్తారో లేదా మారుస్తారో కనుక్కోండి. అలా కుదరని పక్షంలో సైకోసిస్ లక్షణాలు తగ్గడం కోసం కొన్నాళ్ళు సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో ఉండి ‘యాంటీ సైకోటిక్’ మందులు వాడాల్సి ఉంటుంది. ఇలా మందులు వాడినప్పుడు పార్కిన్సన్ జబ్బు లక్షణాలు కొంత పెరగవచ్చు కూడా! అందుకే హాస్పిటల్లో డాక్టరు పర్యవేక్షణలో అడ్మిట్ అయి వైద్యం చేయించుకోవడం మంచిది. మీరు ధైర్యంగా ఉండండి. ఆయన కావాలని ఇదంతా చేయడం లేదని గ్రహించండి. వీలైనంత త్వరగా దగ్గర్లోని మానసిక వైద్యున్ని సంప్రదించండి. ఆల్ ది బెస్ట్! డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com) (చదవండి: 'ట్విన్‌టాస్టిక్'..! పుట్టుకలోనే కాదు ప్రతిభలో కూడా సేమ్ టు సేమ్..!) -
పుతిన్ త్వరలో చనిపోతారు
కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. ఆయన తొందరలోనే చనిపోతారని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మద్య యుద్ధం అప్పుడే ముగుస్తుందన్నారు. పారిస్‌లో ఓ ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మా న్యుయేల్ మాక్రాన్‌తో బుధవారం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా రష్యా మాత్రం సంఘర్షణను ఇంకా లాగుతోందని ఆరోపించారు. ‘‘యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోంది. యుద్ధాన్ని ముగించేలా దానిపై ఒత్తిడి తేవాల్సిన అవసరముంది’’ అన్నారు. పుతిన్ ఆరోగ్యంపై కొన్ని నెలలుగా ఊహాగానాలు, వదంతులు వినిపిస్తున్నాయి. ఆయన ఎడ తెరిపి లేకుండా దగ్గుతున్న వీడియోలు, చేతులు, కాళ్లు అసంకల్పితంగా కదలడం వంటివి పుకార్లకు మరింత బలం చేకూర్చాయి. 2022లో రష్యా మాజీ రక్షణ మంత్రి సెర్గీ షొయిగుతో భేటీ సందర్భంగా పుతిన్ టేబుల్ పట్టుకొని కుర్చీలో కూర్చున్న వీడియో వైరలైంది. ఆయన పార్కిన్సన్, కేన్సర్‌తో పోరా డుతున్నట్టు కొన్ని నివేదికలు కూడా వచ్చాయి. క్రెమ్లిన్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. -
హ్యాట్రిక్‌తో విజృంభించిన ఇంగ్లండ్ బౌలర్
ఇంగ్లండ్‌లో జరుగుతున్న టీ20 బ్లాస్ట్ 2024 ఎడిషన్‌లో కెంట్ బౌలర్, ఇంగ్లండ్ లెగ్ స్పిన్ బౌలర్ మాథ్యూ పార్కిన్సన్ అదిరిపోయే హ్యాట్రిక్ సాధించాడు. మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో హ్యాట్రిక్‌తో కలుపుకుని 4 వికెట్లు పడగొట్టాడు. పార్కిన్సన్ ధాటికి భారీ లక్ష్యాన్ని ఛేదిస్తున్న మిడిల్సెక్స్ 107 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా కెంట్ 98 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెంట్.. జో డెన్లీ (56), బెల్ డ్రమ్మండ్ (38) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.హాల్మెన్ (3/27), బ్లేక్ కల్లెన్ (3/47), టామ్ హెల్మ్ (2/37) బంతితో రాణించారు.A hat-trick for Matt Parkinson! 🤩 pic.twitter.com/RoIcNZgH9X— Vitality Blast (@VitalityBlast) May 31, 2024అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మిడిల్సెక్స్ పార్కిన్సన్, మార్కస్ (2/28), గ్రాంట్ స్టివార్ట్ (2/22), స్వేన్పోయెల్ (1/11), బార్లెట్ (1/16) ధాటికి 14.1 ఓవర్లలోనే చాపచుట్టేసింది. మిడిల్సెక్స్ ఇన్నింగ్స్‌లో హాల్మెన్, ఎస్కినాజీ, జాక్ డేవిస్ తలో 23 పరుగులు చేయగా.. మిగతా వారంతా విఫలమయ్యారు. కాగా. టీ20 బ్లాస్ట్ టోర్నీ మే 30వ తేదీ నుంచి మొదలయ్యింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ఇవాళ మరో రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్ తరఫున ఒక టెస్ట్, 5 వన్డేలు, 6 టీ20లు ఆడిన మాట్ పార్కిన్సన్కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. అంతర్జాతీయ క్రికెట్లో 12 మ్యాచ్‌ల్లో కేవలం 13 వికెట్లు మాత్రమే తీసిన పార్కిన్సన్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 60 మ్యాచ్‌ల్లో 191 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లోనూ పార్కిన్సన్ ఓ మోస్తరు ప్రదర్శనలు చేశాడు. ఈ ఫార్మాట్లో అతను 37 మ్యాచ్‌లు ఆడి 64 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో పాటు దేశీయంగా జరిగే పలు టీ20 టోర్నీల్లో పాల్గొనే పార్కిన్సన్.. ఇప్పటివరకు 104 మ్యాచ్‌లు ఆడి 143 వికెట్లు పడగొట్టాడు. -
ఇలాంటి బౌలింగ్ అరుదు.. దిగ్గజ ఆటగాడు గుర్తురావడం పక్కా!
లంకాషైర్ లెగ్ స్పిన్నర్ మాట్ పార్కిన్సన్ కౌంటీ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో అద్బుత బంతితో మెరిశాడు. కౌంటీలో భాగంగా లంకాషైర్, వార్విక్షైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వార్విక్షైర్ రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి బ్యాటర్ లెగ్‌స్టంప్ అవతల బంతిని వేశాడు. దానిని డిఫెన్స్ ఆడే ప్రయత్నంలో బ్యాటర్ క్రీజు నుంచి ముందుకు వచ్చాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్ తీసుకొని ఆఫ్ స్టంప్ వికెట్‌ను పడగొట్టింది. పార్కిన్సన్ ఇలాంటి బంతి వేయడం ఇది తొలిసారి కాదు. ఇంతకముందు 2021లో నార్త్ హంప్‌షైర్ కెప్టెన్ ఆడమ్ రోసింగ్టన్ను అచ్చం ఇలాంటి బంతితోనే బోల్తా కొట్టించాడు. ఇంకో విషయం ఏంటంటే.. వార్నర్ బాల్ ఆఫ్ ది సెంచరీని గుర్తు చేస్తూ పార్కిన్సన్ సెలబ్రేషన్స్ చేయడం వైరల్‌గా మారింది. పార్కిన్సన్ ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో ఐదు వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక షేన్ వార్న్ ఇంగ్లండ్ బ్యాటర్ మైక్ గాటింగ్‌ను ఔట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో బాల్ ఆఫ్ ది సెంచరీగా మిగిలిపోయింది. ఇక ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఈ ఏడాది మార్చిలో థాయ్‌లాండ్‌లోని తన విల్లాలో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. చదవండి: Sri Lanka Economic Crisis: దేశం దుర్భర స్థితికి ప్రభుత్వమే కారణం.. అసహ్యమేస్తోంది : లంక మాజీ క్రికెటర్లు Lionel Messi: అర్జెంటీనా స్టార్ మెస్సీ కొత్త చరిత్ర.. 61 వ స్థానంలో కోహ్లి How good is this delivery from @mattyparky96? 🤯 Unplayable.#LVCountyChamp pic.twitter.com/qPvxKwDuHs — LV= Insurance County Championship (@CountyChamp) May 10, 2022 Ball of the century? 😳 @mattyparky96 #LVCountyChamp live: https://t.co/SyebMiubg3 pic.twitter.com/Wf93spCqz3 — LV= Insurance County Championship (@CountyChamp) April 16, 2021 -
Jui Keskar: అంకుల్ కష్టం చూసి చలించి.. అద్భుతమైన ఆవిష్కరణ
ఒక ఆవిష్కరణకు ముందు ఒక ఎమోషన్ ఉంటుంది. తన వాళ్లకు వచ్చిన కష్టంలో నుంచి ఒక సమాధానాన్ని ఆలోచించేవాళ్లే ఆవిష్కర్తలవుతారు. మనసు పెట్టి ఆలోచించి, మెదడుతో విశ్లేషించి, శాస్త్ర సాంకేతికతతో పరిశోధన చేసినప్పుడు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఇదే పని చేసింది పుణెకి చెందిన జుయీ అభిజిత్ కేస్కర్ అనే పదహారేళ్ల అమ్మాయి. ఈ అమ్మాయి ఆవిష్కరించిన ‘జేట్రెమోర్– త్రీడీ’ అనే ఉపకరణం వైద్యరంగంలో ఒక కొత్త ఒరవడిని తీసుకురానుంది. అందుకే సైన్స్ అవార్డులతోపాటు జాతీయ అవార్డులు కూడా ఆమె ముందు క్యూలో నిలబడ్డాయి. పుణెకు చెందిన జుయీ కేస్కర్ వాళ్ల అంకుల్ పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతుండేవాడు. నలభై రెండేళ్ల వయసులో ఆయన నరాల బలహీనత కారణంగా చేతులు వణకడం, దేనినీ సరిగ్గా పట్టుకోలేక పోవడం వంటి ఇబ్బందులతో దైనందిన జీవనం దుర్భరంగా మారడం జుయీని కలచివేసింది. అతడు తరచూ హాస్పిటల్‌కు వెళ్లాల్సి రావడం కరోనా సమయంలో ఆమె దృష్టిలో పడింది. డాక్టర్ దగ్గరకు వెళ్తున్నాడు, మందులు మార్చి మరింత శక్తిమంతమైన మందులతో వస్తున్నాడు. కానీ ఆయనలో వస్తున్న వణుకు ఎంత తీవ్రతను తెలియచేసే కొలమానం మాత్రం లేదని అర్థం చేసుకుంది జుయి. సెకనుకు పదోవంతు సమయంలో వచ్చే వణుకును కూడా కచ్చితంగా గుర్తించి ఆ సమాచారాన్ని క్లౌడ్ డాటాబేస్‌లో నిక్షిప్తం చేయవచ్చని, ఆ సమాచారం ఆధారంగా వైద్యులు వ్యాధి తీవ్రతను మరింత కచ్చితంగా అంచనా వేయడానికి సాధ్యమవుతుందని నిరూపించింది జుయీ. అవార్డు వరించింది! ఆమె ఆవిష్కరణకు ‘బ్రాడ్ కామ్ –ఐఆర్‌ఎఐస్ గ్రాండ్’ అవార్డు వచ్చింది. అలాగే దేశంలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ స్టెమ్ నేషనల్ ఫెయిర్‌లో పాల్గొనే ఇరవై మందిలో ఆమెకు కూడా అవకాశం వచ్చింది. యూఎస్‌లోని లింకన్ లాబొరేటరీస్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించే దిశగా నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానం వచ్చింది. దీనితోపాటు అక్కడి రీజెనరాన్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్‌లో మనదేశానికి ప్రాతినిధ్యం వహించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ నేషనల్ అవార్డ్, ఈ ఏడాది బాల పురస్కార్‌కు కూడా ఎంపికైంది. నియంత్రణ ఎలా? ‘దేనినైనా నియంత్రించాలంటే అది ఎంత అనేది తెలిసుండాలి. ఒక ఉపద్రవాన్ని అదుపు చేయాలన్నా సరే... దాని తీవ్రత ఎంత, అది కలిగించే నష్టం ఎంత అనే అంచనా తెలిసుండాలి. అలాగే పార్కిన్సన్స్ కారణంగా దేహంలో వచ్చే ట్రెమర్స్ (వణకడం) తీవ్రతను కచ్చితంగా కొలవగలిగినప్పుడే దానిని నియంత్రించడం, నివారించడం ఏదైనా సాధ్యమవుతుంది’... అంటోంది జుయీ. ‘‘వైద్యరంగంలో ఇందుకోసం ఒక సాధనం ఉంది. కానీ దానిని ఉపయోగించాలంటే హాస్పిటల్‌కి వెళ్లాల్సిందే. అలాగే ఎక్కువ సమయంతో కూడిన పని. నేను రూపొందించిన ఈ సాధనం చేతికి గ్లవుజ్‌గా ధరించవచ్చు. దీనికి ‘జేట్రెమోర్–త్రీడీ’ పేరుతో డెవలప్ చేశాను. ఇందులో అమర్చిన సెన్సర్ యాక్సెలోమీటర్, జైరో మీటర్లను సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం చేసి ఉంటాయి. ఈ సమాచారాన్ని డాక్టర్‌కు ఆన్లైన్ ద్వారా చేర్చవచ్చు. కాబట్టి పేషెంట్ ప్రతిసారీ డాక్టర్‌ను స్వయంగా సంప్రదించాల్సిన అవసరం కూడా ఉండదు’’ అని చెప్తోంది జుయీ కేస్కర్. జూయీ కేస్కర్ ఆవిష్కరించి జేట్మ్రర్స్ త్రీడీ సాధనం ఇప్పటికే రెండు క్లినికల్ ట్రయల్స్‌లో నెగ్గింది. మరికొన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న తర్వాత అందుబాటులోకి వస్తుంది. చదవండి: Laya Mathikshara: ఈమెకు లక్షల్లో డబ్బు... అతడు ఏకంగా 7 కోట్లు సంపాదించాడు! ఇదెలా సాధ్యవుతోందంటే! -
Health Tips: అరిటాకులో తిన్నారంటే.. గ్రీన్ టీ తాగినట్లే..
Health Tips In Telugu: అరిటాకులో భోజనం చేసి ఎన్నాళ్లైంది? ఏమో గుర్తు చేసుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. బఫే భోజనాలు వచ్చిన తర్వాత పెళ్లి భోజనం అరిటాకులో వడ్డించడం దాదాపుగా మర్చిపోయారు. అయితే, అరిటాకులో భోజనం చేస్తే కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం కచ్చితంగా ఆ అలవాటును వదులుకోరు. ►గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలను అరిటాకులో భోజనం చేయడంలోనూ పొందవచ్చు. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అరిటాకులో కూడా ఉంటాయి. వీటితోపాటు అరిటాకులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ సుగుణాలు అదనంగా ఉంటాయి. ఆహారం క్రిమికీటకాదులతో కలుషితమైతే వాటిని అరిటాకులోని ఈ సుగుణాలు హరించి వేస్తాయి. ►ఒకవేళ భోజనం విషపూరితమై ఉంటే అరిటాకు రంగు మారుతుందని, అందుకే రాజులు బంగారు, వెండి పళ్లేలు లేదా అరిటాకులో భోజనం చేసేవారని చెబుతారు. ప్రాచీన గ్రంథాలే కాదు అరిటాకులో భోజనం చేయడాన్ని ఆధునిక పరిశోధనలు కూడా ఆమోదిస్తున్నాయి. ఇందులోని సుగుణాలు క్యాన్సర్ నివారణిగా పని చేస్తాయని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఒక చైనా పరిశోధన... పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్థులకు అరిటాకు మేలు చేస్తుందని తెలియచేసింది. అరిటాకును అలాగే తినలేరు, కాబట్టి అందులో భోజనం చేయడం మంచిదని పరిశోధకుల అభిప్రాయం. నీటి బొట్టు నిలవదు ►అరిటాకును బాగా పరిశీలించండి. ఇది వాటర్‌ప్రూఫ్‌గా ఉంటుంది. నీటి బిందువులు తామరాకు మీద జారిపోయినట్లే అరిటాకు మీద కూడా నిలవకుండా జారిపోతాయి. ఆకులోని స్వచ్ఛమైన సువాసన, ఔషధగుణాలు వేడి పదార్థాల ద్వారా ఆహారంలో కలిసిపోతాయి. రుచిని ఇనుమడింప చేస్తాయి. అరిటాకులో భోజనం చేస్తే కలిగే ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్లోని రహస్యం అదే. పరిశుభ్రంగా తిందాం ►అరిటాకులో భోజనం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... పంటల మీద పెస్టిసైడ్స్ స్వైర విహారం చేస్తున్న ఈ రోజుల్లో అరిటాకును వాడడంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని తీరాలి. ఆకులను ఉప్పు కలిపిన నీటిలో ముంచి శుభ్రం చేయాలి. పైన చెప్పుకున్నట్లు అరిటాకు పై పొర మైనం రాసినట్లు వాటర్ ప్రూఫ్‌గా ఉంటుంది. కాబట్టి ఇతర ఆకులకు పట్టినట్లుగా క్రిమిసంహారక మందులు ఆకును అంటిపెట్టుకోలేవు. అయినప్పటికీ శుభ్రం చేయడంలో అలసత్వం వద్దు. చదవండి: Legs Swelling Health Tips: ధనియాలను నీటిలో మరిగించి తాగారంటే... -
పక్కకు పడుకుంటే మతిమరుపు దూరం
న్యూయార్క్: మీరు వెల్లకిలాగాని, బోర్లాగాని పడుకుంటున్నారా..అయితే మీరు పడుకునే విధానం మార్చుకుని పక్కకు పడుకోవడం ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే..పక్కకు పడుకొనేవారిలో అల్జీమర్స్ (మతిమరుపు), పార్కిన్సన్ (వణుకురోగం)తోపాటు నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం తక్కువని తాజా అధ్యయనంలో తేలింది. పక్కకు పడుకోవడంవల్ల మెదడులోని వ్యర్థ, హానికారక రసాయనాలు చాలావరకూ తొలగిపోతాయి. ఇలాంటి వ్యర్థ రసాయనాలే అల్జీమర్స్‌తో పాటు నరాల వ్యాధులకు కారణమౌతాయి. పక్కకు పడుకునేవారి మెదడు సంబంధిత గ్లింపటిక్ పాత్‌వేను ఎమ్ఆర్ఐ స్కాన్ చేయగా ఈ సంక్లిష్ట వ్యవస్థ వ్యర్థాలను శుభ్రపరుస్తున్నట్లు తేలింది.