పనిమనిషికి తన పేరు పెట్టడంపై హీరో ఆగ్రహం! | Shiney Ahuja files case against Great Grand Masti makers for calling a maid Shiney | Sakshi
Sakshi News home page

పనిమనిషికి తన పేరు పెట్టడంపై హీరో ఆగ్రహం!

Jul 14 2016 6:01 PM | Updated on Sep 4 2017 4:51 AM

పనిమనిషికి తన పేరు పెట్టడంపై హీరో ఆగ్రహం!

పనిమనిషికి తన పేరు పెట్టడంపై హీరో ఆగ్రహం!

అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'కి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి.

అడల్ట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'గ్రేట్ గ్రాండ్ మస్తీ'కి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. వచ్చేవారం విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటికే ఆన్ లైన్ లో లీకైంది. దీంతో సినిమా విడుదలను ఒకవారం ముందుకుజరిపి శుక్రవారం (రేపు) చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై బాలీవుడ్ నటుడు షైనీ ఆహుజా కేసు నమోదు చేశాడు. ఈ సినిమాలో పనిమనిషి పేరు షైనీ అని పెట్టారని కథనాలు వచ్చాయి. నటి సోనాలి రావత్ పోషించిన పాత్రకు షైనీ అని పేరు పెట్టినట్టు సమాచారం.

హీరోలు రితేశ్ దేశ్ ముఖ్, వివేక్ ఒబరాయ్, ఆఫ్తాబ్ శివదాసని షైనీ అనే పనిమనిషి వెంటపడుతూ.. ఓ పాట కూడా పాడుతారని, ఈ నేపథ్యంలోనే షైనీ పాత్రతో సినిమాలో కొన్ని కామెడీ సీన్లు ఉంటాయని సినీ వర్గాలు అంటున్నాయి. అయితే, తన పేరును అభ్యంతరకరంగా వాడి, తన పరువుకు భంగం కలిగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాతలపై షైనీ ఆహూజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో షైనీ పేరిట ఉన్న పాత్ర సన్నివేశాలన్నిటినీ తొలగించాలని, అంతేకాకుండా చిత్రయూనిట్ తనకు రాతపూర్వక క్షమాపణ చెప్పాలని ఆయన తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.

పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోగా నటించిన షైనీ ఆహుజా తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారం చేయడంతో ఆయనకు ముంబై కోర్టు 2011 మార్చిలో ఏడున్నరేళ్ల జైలుశిక్ష విధించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement