లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు | Sensex Up 100 Points; Reliance Industries, HDFC Bank Among Gainers | Sakshi
Sakshi News home page

లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

Sep 29 2016 10:41 AM | Updated on Sep 4 2017 3:31 PM

అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలతో గురువారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.

అంతర్జాతీయంగా వస్తున్న బలమైన సంకేతాలతో గురువారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో150 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 106.48 పాయింట్ల లాభంతో 28,399 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 31.35 పాయింట్ల లాభంలో 8,776 వద్ద ట్రేడ్ అవుతోంది.అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్ సంకేతాలతో పాటు ఆయిల్, గ్యాస్, రియాల్టీ, ఆటో, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ సూచీల్లో కొనుగోలు మద్దతు కొనసాగుతోంది. దీంతో స్టాక్ మార్కెట్లు లాభాలను పండిస్తున్నాయి.
 
రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, హీరో మోటార్ కార్పొలు సెన్సెక్స్లో టాప్లో నడుస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్సియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నేడు మార్కెట్లో లిస్టు అయింది. ఇష్యూ ధర రూ.334కు 1.5 శాతం డిస్కౌంట్తో రూ.329గా స్టాక్ ప్రారంభమైంది. అంటే దాదాపు 2 శాతం పడిపోయింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెంచడానికి ఉత్పత్తిని తగ్గిస్తామని ఓపెక్ సభ్యులు నిర్ణయించడంతో ఆసియన్ స్టాక్స్ గురువారం ట్రేడింగ్లో లాభాలను రాణిస్తున్నాయి. మరోవైపు ఓపెక్ సభ్యుల ఒప్పందం యూఎస్ స్టాక్స్కు మద్దతు పలికింది. డోజోన్స్ ఇండస్ట్రియల్, ఎస్ అండ్ పీ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement