దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 265 పాయింట్ల లాభంతో 27,518 వద్ద నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 8525 దగ్గర ముగిసింది.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కొనుగోళ్లమద్దతుతో రోజంతా ఆకర్షనీణంగా సాగిన మార్కెట్లు మిడ్ సెషన్ తర్వాత ఒకదశలో దాదాపు 500 పాయింట్ల లాభాలకు చేరువలోకి వచ్చింది. కానీ చివర్లో అమ్మకాలతో జోరు తగ్గిన సెన్సెక్స్ 265 పాయింట్ల లాభంతో 27,518 వద్ద నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 8525 దగ్గర ముగిసింది. ట్రంప్ స్టన్నింగ్ విక్టరీతో అన్ని రంగాలు దూకుడు ప్రదర్శించాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ జోరు మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఆటో ఐటీనంగం స్వల్పంగా నష్టపోయింది. టాటా స్టీల్, బీవోబీ హిందాల్కో, సిప్లా, ఇన్‌ఫ్రాటెల్, యస్‌బ్యాంక్, పవర్‌గ్రిడ్, అరబిందో, ఐసీఐసీఐ లాభపడగా హీరో మోటో, హెచ్‌డీఎఫ్‌సీ, బాష్, బజాజ్ ఆటో, లుపిన్, ఐషర్, మారుతీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌యూఎల్ నష్టపోయాయి. అటు క్యూ 2 ఫలితాలతో ఏషియన్ పెయింట్స్ నష్టాలను చవి చూసింది.
కాగా డాలర్ మారకపు విలువలో రూపాయి 15పైసలు బలహీనపడి 66.58దగ్గర ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో నిన్నటి హుషారుకు బ్రేక్ పడిన పుత్తడి 10 గ్రా. 30,000 వద్ద స్థిరంగా ఉంది.