ఎస్‌బీఐ ముందస్తు పన్ను చెల్లింపు 33% డౌన్ | SBI's advance tax payment down 33% at Rs 1,130 cr | Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ ముందస్తు పన్ను చెల్లింపు 33% డౌన్

Dec 17 2013 1:32 AM | Updated on Sep 2 2017 1:41 AM

ఎస్‌బీఐ ముందస్తు పన్ను  చెల్లింపు 33% డౌన్

ఎస్‌బీఐ ముందస్తు పన్ను చెల్లింపు 33% డౌన్

దేశీ బ్యాంకింగ్ అగ్రగామి ముందస్తు పన్ను(ఏటీ) చెల్లింపులు 33 శాతం తగ్గాయి. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసే మూడో త్రైమాసికానికి(క్యూ3)గాను రూ.1,130 కోట్ల ఏటీ చెల్లించింది.

 ముంబై: దేశీ బ్యాంకింగ్ అగ్రగామి ముందస్తు పన్ను(ఏటీ) చెల్లింపులు 33 శాతం తగ్గాయి. ఈ ఏడాది డిసెంబర్‌తో ముగిసే మూడో త్రైమాసికానికి(క్యూ3)గాను రూ.1,130 కోట్ల ఏటీ చెల్లించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1,701 కోట్లతో పోలిస్తే భారీగా తగ్గింది. కాగా, వరుసగా రెండో క్వార్టర్‌లోనూ ఎస్‌బీఐ ఏటీ చెల్లింపులు తగ్గుముఖం పట్టడం(సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1,120 కోట్లు-40%క్షీణత) గమనార్హం. వాస్తవానికి ఏటీ చెల్లింపులకు ఈ నెల 15 వరకే గడువు ఉండగా.. వారాంతం నేపథ్యంలో మరో రెండు రోజులు(17 వరకూ) పొడిగించిన సంగతి తెలిసిందే.
 
  కంపెనీల పనితీరుకు ఏటీ చెల్లింపులను కీలకమైన కొలమానంగా పరిగిణిస్తూ ఉంటారు. కాగా, హెచ్‌డీఎఫ్‌సీ క్యూ3 ఏటీ చెల్లింపు రూ.650 కోట్లుగా ఆదాయపు పన్ను(ఐటీ) వర్గాలు పేర్కొన్నాయి. క్రితం క్యూ3లో ఈ మొత్తం రూ.560 కోట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement