రుణ సెక్యూరిటీల ద్వారా రూ.11 వేల కోట్లు | SBI to raise up to Rs 11,000 crore via debt securities | Sakshi
Sakshi News home page

రుణ సెక్యూరిటీల ద్వారా రూ.11 వేల కోట్లు

Aug 24 2016 2:48 PM | Updated on Sep 4 2017 10:43 AM

భారతీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణ సెక్యూరిటీల ద్వారా రూ.11 వేలకోట్లకు పైగా సమకూర్చుకోనుంది.

ముంబై: భారతీయ ప్రభుత్వ  బ్యాంకింగ్  దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్  ఇండియా రుణ సెక్యూరిటీల ద్వారా రూ.11 వేలకోట్లకు పైగా సమకూర్చుకోనుంది. మూలధన సమీకరణకు నియమించిన డైరెక్టర్ల కమిటీ ఈమేరకు సమ్మతించిందని ఎస్బీఐ బీఎస్సీ ఫైలింగ్ లో తెలిపింది. ప్రైవేటు ప్లేస్‌మెంట్‌ ఆధారంగా రుణ సెక్యూరిటీలను సమీకరించుకోనుంది.  ఎడిషనల్   టైర్ 1(ఏటీ1)  మూలధనం కోసం బాసెల్-III కంప్లైంట్ డెట్ ఇన్ స్ట్రుమెంట్స్  పెంచనున్నట్టు  పేర్కొంది.  

బుధవారం జరిగిన డైరెక్టర్ల కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.  విదేశీ లేదా భారతీయ పెట్టుబడిదారులను ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా అంగీకరించినట్టు  పేర్కొంది.   దీంతో ఎస్ బీఐ షేర్ ధర 0.08 శాతం లాభపడి రూ 254,80 వద్ద  ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement