చిదంబరం సతీమణిని ప్రశ్నించిన సీబీఐ | Saradha scam: Nalini Chidambaram examined by CBI | Sakshi
Sakshi News home page

చిదంబరం సతీమణిని ప్రశ్నించిన సీబీఐ

Sep 21 2014 4:56 PM | Updated on Sep 2 2017 1:44 PM

చిదంబరం సతీమణిని ప్రశ్నించిన సీబీఐ

చిదంబరం సతీమణిని ప్రశ్నించిన సీబీఐ

శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం సతీమణి నళినిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు.

న్యూఢిల్లీ: శారదా చిట్ఫండ్ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం సతీమణి నళినిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. చెన్నైలో శనివారం సాయంత్రం ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నించారని అధికార వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం జైలులో ఉన్న శారదా చిట్ఫండ్ చైర్మన్ సుదీప్త సేన్.. నళినికి లాయర్ ఫీజు కింద నళినికి కోటి రూపాయలు చెల్లించినట్టు వెల్లడించారు. దీనిపై ఆమెను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. నళినిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్టు వచ్చిన వార్తలను ఆమె సన్నిహితులు కొట్టిపారేశారు. శారదా చిట్ఫండ్ నుంచి న్యాయబద్దంగానే నళిని కోటి రూపాయలు తీసుకున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement