నాటో సభ్వత్వ దేశాలైన పోలెండ్, లుథియానాల సరిహద్దుల్లో రష్యా..
విల్నియస్: నాటో సభ్వత్వ దేశాలైన పోలెండ్, లుథియానాల సరిహద్దుల్లో రష్యా న్యూక్లియర్ ఆయుధాలైన ఇస్కాండర్ మిస్సైల్స్ ను సిద్ధం చేస్తుండటం వివాదాస్పదంగా మారింది. సిరియా, ఉక్రయిన్ దేశాలపై తన పట్టును పెంచుకునేందుకే పశ్చిమ దిశగా రష్యా అడుగులు వేస్తోందని లుథియానా ఆరోపించింది. న్యూక్లియర్ ఆయుధాల వినియోగ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించే ప్రమాదం ఉందని పోలెండ్ వ్యాఖ్యానించింది.
సరిహద్దు ప్రాంతమైన కలినిగ్రాడ్ లో రష్యా మిలటరీ విన్యాసాలకు ఇస్కాండర్ మిస్సైల్స్ ను కూడా రప్పిస్తోందని లుథియానా విదేశాంగ మంత్రి లినాస్ లింకేవిసియస్ అన్నారు. ఈ విన్యాసాల్లో భాగంగా ఇస్కాండర్ మిస్సైల్స్ ను రష్యా వినియోగించే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. దాదాపు 700కిలోమీటర్ల లక్ష్యాలను అందుకోగల ఇస్కాండర్ మిస్సైళ్లతో జర్మనీ రాజధాని బెర్లిన్ కు మధ్యలో ఉన్న పోలెండ్, లుథియానాలను టార్గెట్ చేయొచ్చని చెప్పారు. పోలిష్ రక్షణ శాఖ మంత్రి ఆంటోని రష్యా చర్యలు ఇతర దేశాలను ఆత్మరక్షణలో పడేశాలా ఉన్నాయని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై స్పందించిన రష్యా రక్షణ శాఖ ఇస్కాండర్ మిస్సైల్స్ ను పలుమార్లు సరిహద్దు ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది. అయితే, పశ్చిమంగా పట్టు సాధించేందుకే మిస్సైల్స్ ను తరలిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసింది. ఆర్మీ ట్రైనింగ్ లో భాగంగా మాత్రమే ఇస్కాండర్ ను కలినిన్ గ్రాడ్ ప్రాంతానికి పంపినట్లు పేర్కొంది. భవిష్యత్తులో కూడా ఇస్కాండర్ ను ట్రైనింగ్ కోసం తరలిస్తామని తెలిపింది. కోల్డ్ వార్ తర్వాత పశ్చిమ భాగంలో బలహీనపడిన రష్యా ఇస్కాండర్ మిస్సైల్స్ తో మిలటరీ డ్రిల్స్ ను నిర్వహిస్తూ వస్తోంది. గత ఏడేళ్లుగా ఇస్కాండర్ ఆయుధాలతో పశ్చిమ దేశాలపై ఒత్తిడి తేవడానికి రష్యా ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.