నెల రోజుల కనిష్టానికి రూపాయి విలువ | Rupee dips 36 paise to one-month low of 62.26 against dollar | Sakshi
Sakshi News home page

నెల రోజుల కనిష్టానికి రూపాయి విలువ

Jan 3 2014 2:21 AM | Updated on Sep 2 2017 2:13 AM

దేశీ స్టాక్ మార్కెట్ల పతన ధోరణితో రూపాయి కూడా నష్టాల్లోకి జారింది. డాలరుతో రూపాయి మారకం విలువ గురువారం 36 పైసలు క్షీణించి 62.26 వద్ద ముగిసింది.

ముంబై: దేశీ స్టాక్ మార్కెట్ల పతన ధోరణితో రూపాయి కూడా నష్టాల్లోకి జారింది. డాలరుతో రూపాయి మారకం విలువ గురువారం 36 పైసలు క్షీణించి 62.26 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల కనిష్ట స్థాయి. ప్రధాన విదేశీ కరెన్సీలతో డాలరు బలం పుంజుకోవడం, దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ జోరు కూడా దేశీ కరెన్సీ నష్టాలకు కారణమైందని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు. క్రితం ముగింపు 61.90తో పోలి స్తే.. గురువారం స్థిరంగానే రూపాయి ట్రేడింగ్ మొదలైంది. క్రమంగా 61.74 గరిష్టాన్ని కూడా తాకింది. అయితే, స్టాక్ మార్కెట్ల తిరోగమనంతో దేశీ కరెన్సీ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిందని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈఓ అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు.. చైనాలో తయారీ రంగం గణాంకాలు బలహీనంగా ఉం డటం ఇతరత్రా కారణాలతో బీఎస్‌ఈ సెన్సెక్స్  252 పాయింట్లు క్షీణించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement