హాలీవుడ్ తరహాలో బ్యాంకు దోపిడీ | robbers dig tunnel into bank strong room in haryana | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ తరహాలో బ్యాంకు దోపిడీ

Oct 28 2014 12:13 PM | Updated on Sep 2 2017 3:30 PM

హాలీవుడ్ తరహాలో బ్యాంకు దోపిడీ

హాలీవుడ్ తరహాలో బ్యాంకు దోపిడీ

హర్యానాలోని ఓ బ్యాంకులో దోపిడీకి దొంగలు హాలీవుడ్ సినిమా తరహా టెక్నిక్ ఉపయోగించారు.

హర్యానాలోని ఓ బ్యాంకులో దోపిడీకి దొంగలు హాలీవుడ్ సినిమా తరహా టెక్నిక్ ఉపయోగించారు. అక్కడి గొహానా పట్టణంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు స్ట్రాంగ్ రూంలోకి దూరం నుంచి ఒక సొరంగం తవ్వి, అందులో ఉన్న నగదుతో పాటు కోట్లాది రూపాయల విలువ చేసే సొత్తు దోచుకెళ్లిపోయారు. రోడ్డుకు అవతలివైపున ఉన్న ఓ పాత భవనం లోంచి 2.5 అడుగుల వెడల్పున్న సొరంగాన్ని దొంగలు తవ్వారు.

దేశంలో ఇటీవలి కాలంలో జరిగిన బ్యాంకు దోపిడీలలో ఇది అతిపెద్దదని చెబుతున్నారు. దోపిడీ దొంగలు చాలా కాలం క్రితం నుంచే ఈ సొరంగం తవ్వుతున్నా.. ఎవరికీ ఎందుకు తెలియలేదన్న విషయాన్ని పోలీసు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సొరంగం నేరుగా స్ట్రాంగ్ రూంలోకి వెళ్లింది. ఆ రూంలో మొత్తం 360 లాకర్లుండగా, వాటిలో 90 లాకర్లను దొంగలు పగలగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement