తెలంగాణ ఎంపీల మధ్య జల వివాదం | rift among telangana mp's over irrigation projects | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎంపీల మధ్య జల వివాదం

Nov 1 2013 4:16 PM | Updated on Sep 2 2017 12:12 AM

తెలంగాణ ఎంపీల మధ్య జల వివాదం

తెలంగాణ ఎంపీల మధ్య జల వివాదం

రాష్ట్ర విభజనకు ముందే తెలంగాణ ఎంపీల మధ్య జల వివాదం రాజుకుంది.

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనకు ముందే తెలంగాణ ఎంపీల మధ్య జల వివాదం రాజుకుంది. కంతాన పల్లి ప్రాజెక్టు డిజైన్ వ్యవహారంకు సంబంధించి టీ. ఎంపీల మధ్య రగడ మొదలైంది.  ఎంపీ పొన్నం ప్రభాకర్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్వాయి గోవర్థన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్యల మధ్య వివాదం చోటు చేసుకుంది. గత కొన్నిరోజుల నుంచి కంతాన పల్లి ప్రాజెక్టు డిజైన్ పై వ్యతిరేకిత వ్యక్తం చేస్తున్నఎంపీ పాల్వాయి తిరిగి ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కంతానపల్లి ప్రాజెక్టు సంబంధించి ఇప్పటికే కేంద్రాన్ని డిజైన్ మార్చాలని కోరినట్లు పాల్వాయి తెలిపారు. ఆ డిజైన్ వల్ల ఒక్క చుక్క నీరు కూడా ఉపయోగపడదని తెలిపారు. కాగా, ఇప్పడున్న డిజైన్ తో లాభం చేకూరందని సిరిసిల్ల వ్యాఖ్యానించారు. దీంతో ఇరువురి మధ్య అభిప్రాయబేధాలు చవిచూశాయి.

 

గత కొన్ని రోజుల నుంచి కంతానపల్లి ప్రాజెక్టు డిజైన్ తో పాటు, పోలవరం ప్రాజెక్టు , దమ్ముగూడెం ప్రాజెక్టు డిజైన్లపై ఎంపీ పాల్వాయి వ్యతిరేకిస్తూవస్తున్నారు. తాజాగా మరోమారు కంతానపల్లి ప్రాజెక్టు డిజైన్ ను పాల్వాయి వ్యతిరేకించడంపై రాజయ్య సమావేశం నుంచి లేచివెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement