15 శాతం వృద్ధి సాధిస్తాం | Reliance Life to add 20000 agents during next fiscal | Sakshi
Sakshi News home page

15 శాతం వృద్ధి సాధిస్తాం

Mar 25 2015 2:41 AM | Updated on Sep 2 2017 11:19 PM

15 శాతం వృద్ధి సాధిస్తాం

15 శాతం వృద్ధి సాధిస్తాం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ జీవిత బీమా రంగం నెగిటివ్ వృద్ధిని కనపర్చగా, తాము రెండంకెల వృద్ధిని నమోదుచేశామని,

 రిలయన్స్ లైఫ్ చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ మనోరంజన్
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీయ జీవిత బీమా రంగం నెగిటివ్ వృద్ధిని కనపర్చగా, తాము రెండంకెల వృద్ధిని నమోదుచేశామని, అదే విధంగా వచ్చే ఏడాది కూడా పరిశ్రమ సగటు కంటే అధిక వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను రిలయన్స్ లైఫ్ ప్రకటించింది. ప్రస్తుత ఏడాది 10 శాతం వృద్ధితో రూ. 1,100 కోట్ల కొత్త ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించామని, వచ్చే ఏడాది 15 శాతం వృద్ధిని ఆశిస్తున్నట్లు రిలయన్స్ లైఫ్ చీఫ్ ఏజెన్సీ ఆఫీసర్ మనోరంజన్ సాహూ తెలిపారు. రిలయన్స్‌లైఫ్ సీఎస్‌ఆర్ కార్యక్రమ వివరాలను తెలియచేయడానికి హైదరాబాద్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన  వచ్చే ఆర్థిక సంవత్సరం దేశీయ జీవిత బీమా పరిశ్రమ 10 నుంచి 12 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.  ఐఆర్‌డీఏ నుంచి అనుమతి రాగానే త్వరలో ఎండోమెంట్, మనీ బ్యాక్, టర్మ్ పాలసీల్లో ఐదు పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement