నోబెల్ శాంతి బహుమతికి ఎప్పుడూ మహా అయితే పది మందో, పాతిక మందో పోటీ పడతారు. కానీ ఈసారి మాత్రం ఎప్పుడూ లేనంతగా 278 మంది ఈ బహుమతికి నామినేట్ అయ్యారు.
నోబెల్ శాంతి బహుమతికి ఎప్పుడూ మహా అయితే పది మందో, పాతిక మందో పోటీ పడతారు. కానీ ఈసారి మాత్రం ఎప్పుడూ లేనంతగా 278 మంది ఈ బహుమతికి నామినేట్ అయ్యారు. నోబెల్ బహుమతుల విజేలత పేర్లను అక్టోబర్ నెలలో ప్రకటిస్తారు. సాధారణంగా ప్రతిఏటా ఈ నామినేషన్లు పెరుగుతూనే ఉంటాయని, దీన్ని బట్టే ఈ అవార్డుకు ఉన్న ప్రాధాన్యం తెలుస్తోందని సంస్థ అధినేత గైర్ లండెస్టాడ్ తెలిపారు.
ప్రపంచం నలుమూలల నుంచి తమకు నామినేషన్లు అందుతున్నాయన్నారు. ఈసారి వచ్చిన నామినేషన్లను సమీక్షించేందుకు నోబెల్ కమిటీ సమావేశమైంది. నామినేషన్లు పంపేందుకు చివరి గడువు ఫిబ్రవరి 1. తొలిసమావేశంలో ఈ కమిటీలో ఉండే ఐదుగురు సభ్యులు మరిన్ని పేర్లను తమకు తాముగా జాబితాకు జత చేయచ్చు. గత సంవత్సరం ఈ అవార్డుకు 259 నామినేషన్లు వచ్చాయి.