అమెరికాలోని కన్సాస్, ఓక్లహామా రాష్ట్రాలను భూప్రకంపనలు వణికించాయి. భూప్రకంపనాల తీవ్రత రిక్టర్ స్ట్కేల్ పై 4.8గా నమోదైంది
యూఎస్ లోని రెండు రాష్ట్రాల్లో భూప్రకంనలు!
Nov 13 2014 9:57 AM | Updated on Sep 2 2017 4:24 PM
వాషింగ్లన్: అమెరికాలోని కన్సాస్, ఓక్లహామా రాష్ట్రాలను భూప్రకంపనలు వణికించాయి. భూప్రకంపనాల తీవ్రత రిక్టర్ స్ట్కేల్ పై 4.8గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో కన్సాస్ లోని కాన్ వే కు సమీపంలో సంభవించినట్టు సమాచారం. యూఎస్ లో సాధారణంగా భూకంప సంఘటనలు అరుదుగా కనిపిస్తాయి.
భూకంప సమాచారాన్ని స్థానికులు ట్విటర్ లో కుప్పలుతెప్పలుగా పోస్ట్ చేశారు. భూప్రకంపనాలు ఇంత భయంకరంగా ఉంటుందని అనుకోలేదని కొందరు నెటిజన్లు ట్వీట్ చేశారు. అమెరికాలో ఎక్కువగా టోర్నాడోలు స్థానికులు భయభ్రాంతులకు గురిచేస్తాయి. తాజా అరుదైన భూప్రకంపనలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి.
Advertisement
Advertisement