ముళ్ల పందిని మింగి 'చచ్చింది' | Python dies after eating giant porcupine in S Africa | Sakshi
Sakshi News home page

ముళ్ల పందిని మింగి 'చచ్చింది'

Jun 27 2015 12:52 PM | Updated on Sep 3 2017 4:28 AM

ముళ్ల పందిని మింగి 'చచ్చింది'

ముళ్ల పందిని మింగి 'చచ్చింది'

ముళ్ల పందిని మింగి... దాన్ని జీర్ణం చేసుకోలేక నానా అవస్థలు పడి.. చివరకు భారీ కొండ చిలువ ప్రాణాలు విడిచింది.

జోహెన్స్ బర్గ్: ముళ్ల పందిని మింగి... దాన్ని జీర్ణం చేసుకోలేక నానా అవస్థలు పడి.. చివరకు భారీ కొండ చిలువ ప్రాణాలు విడిచింది. ఈ సంఘటన దక్షిణాఫ్రికా లేక్ ఈలాండ్ గేమ్ రిజర్వ్ ఫారెస్ట్లోని ఓ ప్రైవేట్ గేమ్ పార్క్లో చోటు చేసుకుంది. 3.9 మీటర్లు ఉన్న కొండ చిలువ 13.8 కేజీలున్న ముళ్ల పందిని కొండ చిలువ అమాంతంగా మింగేసింది. కానీ దానిని జీర్ణం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించి.. ప్రయత్నించి.. చివరకు గత శనివారమే ప్రాణాలు విడిచిందని పార్క్ మేనేజర్ శుక్రవారం వెల్లడించారు.

అయితే కొండ చిలువ మరణించిన సంగతిని తాము ఈ రోజే గుర్తించినట్లు చెప్పారు. కొండ చిలువ అహారం తీసుకుని పడుకుందని... పార్క్ వచ్చే వారితో పాటు తాము భావించామని చెప్పారు. కొండ చిలువ సాధారణంగా ముళ్ల పందిని తినదని పేర్కొన్నారు. అయితే ఈ సంఘటన ఇలా జరగడం విచారకరమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement