ఖైదీభామల క్యాట్‌వాక్‌ | Sakshi
Sakshi News home page

ఖైదీభామల క్యాట్‌వాక్‌

Published Sun, Sep 29 2013 10:38 AM

prison catwalk in bogota

కురచ దుస్తులు ధరించి వయ్యారాలు ఒలకబోస్తున్న ఈ అందగత్తెలు నిజానికి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు. కొలంబియా దేశంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా  రవాణాచేస్తూ దొరికిపోయిన వీరంతా శుక్రవారం బొగోటా నగర జైలులో ఇలా అందాల పోటీల్లో పాల్గొన్నారు.

‘రివర్స్’ కారు!
రేసులో యాక్సిడెంట్‌ అయి కారు బోల్తాపడలేదు. సరిగ్గా చూడండి.. కారే అలాగుంది. రీమోడలింగ్‌లో స్పెషలిస్టు అయిన అమెరికాకు చెందిన జెఫ్‌ బ్లోచ్‌ దీన్నిలా తయారుచేశాడు. ఆ మధ్య చిన్నపాటి సెస్నా విమానాన్ని రేస్‌కారులా మార్చేసిన జెఫ్‌.. తాజాగా అక్కడి ప్రఖ్యాత లెమన్‌ రేసులో పాల్గొనడం కోసం ఈ వినూత్న వాహనాన్ని రూపొందించాడు.

కారు క్లీనింగ్‌ యమ కాస్‌‌టలీ!
కారు కడిగించుకోవాలి.. టెఫ్లాన్‌ కోటింగ్‌ వేయించుకోవాలి... మహా అయితే ఎంతవుతుంది? రూ.2, 3 వేలకు మించి అవదు అంతేగా.. ఓసారి స్కాట్లాండ్‌లోని కిర్‌‌కకాల్డీలో ఉన్న ‘అల్టిమేట్‌ షైన్‌’ కంపెనీలో కారు క్లీనింగ్‌ చేయించుకుని చూడండి.. అక్కడి వాళ్లు మీ కారును కడగడంతోపాటు బ్యాంకులో ఉన్న మొత్తం సొమ్మునూ కడిగిపారేస్తారు. ఎందుకంటే.. వీరు రెండు కార్ల క్లీనింగ్‌కు ఏడాదికి రూ.90 లక్షలు చార్జి చేస్తారు! అలాగని.. ప్రతి నెలా క్లీన్‌ చేస్తారనుకునేరు.. ఏడాదికి మహా అయితే.. మూడు లేదా నాలుగుసార్లు కడుగుతారు అంతే..

Advertisement
Advertisement