‘జన్‌ధన్’పై అవగాహన పెంచండి: మోదీ | PM Narendra Modi about Jandhan Yojana | Sakshi
Sakshi News home page

‘జన్‌ధన్’పై అవగాహన పెంచండి: మోదీ

Nov 5 2015 4:38 AM | Updated on Aug 20 2018 9:16 PM

‘జన్‌ధన్’పై అవగాహన పెంచండి: మోదీ - Sakshi

‘జన్‌ధన్’పై అవగాహన పెంచండి: మోదీ

కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక జన్‌ధన్ యోజన పథకంపై సమీక్షించిన ప్రధాని నరేంద్రమోదీ..

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక జన్‌ధన్ యోజన పథకంపై సమీక్షించిన ప్రధాని నరేంద్రమోదీ.. సమస్యల పరిష్కారంతోపాటు పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. మొబైల్ ఫోన్ల ద్వారా ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఏడోసారి ‘ప్రగతి’(ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ) ద్వారా చీఫ్ సెక్రటరీలతో మాట్లాడిన మోదీ.. ఆధార్ కార్డులపైనా సమీక్ష జరిపారు. జన్‌ధన్ ను ఆధార్‌తో అనుసంధానించి ప్రజలకు లాభం జరిగేలా చూడాలన్నారు.  జాతీయ రహదారులు, రైల్వేలు, విద్యుత్, బొగ్గు, ఎయిర్‌పోర్టులపై కూడా వివిధ రాష్ట్రాల సీఎస్‌లనుంచి సమాచారం సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement