రైల్వేలను ప్రైవేటీకరించం: మోదీ | PM Modi rules out privatisation of Railways | Sakshi
Sakshi News home page

రైల్వేలను ప్రైవేటీకరించం: మోదీ

Dec 25 2014 4:19 PM | Updated on Aug 15 2018 2:20 PM

రైల్వేలను ప్రైవేటీకరించం: మోదీ - Sakshi

రైల్వేలను ప్రైవేటీకరించం: మోదీ

రైల్వేలను ప్రైవేటీకరించబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

వారణాసి: రైల్వేలను ప్రైవేటీకరించబోమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సుపరిపాలన దినోత్సవంలో భాగంగా గురువారం ఆయన తన నియోజకవర్గం వారణాసిల పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైల్వేల అభివృద్ధితో దేశమూ అభివృద్ధి చెందుతుందని అన్నారు. లక్షల మందికి రైల్వే ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు.

దేశంలో 4 రైల్వే యూనివర్సిటీలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు చెప్పారు. భారతీయ రైల్వేలో 60 ఏళ్లుగా ఎలాంటి పురోగతి లేదన్నారు. కొద్దికాలంలోనే రైల్వేలను అభివృద్ధి చేస్తామన్నారు. 'మేకిన్ ఇండియా' దిశగా యువతను ప్రోత్సహిస్తామని మోదీ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement