రోడ్డు ప్రమాదంలో తిరుమల యాత్రీకుల మృతి | pilgrims died at a road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో తిరుమల యాత్రీకుల మృతి

May 30 2017 9:04 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తున్న కారును అనంతరాజుపేట వద్ద ఓ కంటైనర్‌ ఢీకొంది.

- కారును ఢీకొన్న కంటైనర్‌.. ముగ్గురి మృతి

రైల్వే కోడూరు:
పుణ్య క్షేత్రానికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. వైఎస్సార్‌ కడప జిల్లా రైల్వే కోడూరు మండలంలోని అనంతరాజుపేట వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌ నుంచి తిరుపతి వెళ్తున్న కారును అనంతరాజుపేట వద్ద ఓ కంటైనర్‌ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరిని తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రమైన గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.అయితే మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement