'బందిపోటు రాణి' హంతకుడికి జీవితఖైదు | Phoolan Devi's killer gets life imprisonment | Sakshi
Sakshi News home page

'బందిపోటు రాణి' హంతకుడికి జీవితఖైదు

Aug 14 2014 2:48 PM | Updated on Sep 2 2017 11:52 AM

'బందిపోటు రాణి' హంతకుడికి జీవితఖైదు

'బందిపోటు రాణి' హంతకుడికి జీవితఖైదు

పూలన్ దేవి హంతకుడు షేర్ సింగ్ రాణాకు ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది.

న్యూఢిల్లీ: పూలన్ దేవి హంతకుడు షేర్ సింగ్ రాణాకు ఢిల్లీ కోర్టు జీవితఖైదు విధించింది. అతడికి లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది. గత పదమూడేళ్లుగా సాగుతున్న ఈ కేసుపై ఢిల్లీలోని అదనపు సెషన్స్ కోర్టు గురువారం తుది తీర్పు వెలువరించింది. ఈ నెల 8న అతడిని దోషిగా కోర్టు నిర్ధారించింది. ఆగస్టు 12న శిక్ష ఖరారవుతుందని భావించినా రెండు రోజులు ఆలస్యంగా తుది తీర్పు వెలువడింది.

ఈ కేసులో 10 మంది నిందితులను సరైన సాక్ష్యాధారాలు లేవంటూ నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. బందిపోటు రాణిగా ప్రఖ్యాతి గాంచిన పూలన్‌దేవి 2001 జూలై 25న ఢిల్లీలోని తన నివాసం ముందు హత్యకు గురైయ్యారు. పార్లమెంటు సమావేశాలకు హాజరై మధ్యాహ్న భోజనం కోసం ఇంటికి వచ్చిన ఆమెను రాణా సహా ముగ్గురు దుండగులు అతి దగ్గర నుంచి కాల్చి చంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement