ఆ పాపం ప్రజలదే: అశోక్‌బాబు | Paruchuri Ashok Babu call for Defeat birucate Leaders | Sakshi
Sakshi News home page

ఆ పాపం ప్రజలదే: అశోక్‌బాబు

Feb 17 2014 1:32 PM | Updated on Mar 23 2019 9:03 PM

ఆ పాపం ప్రజలదే: అశోక్‌బాబు - Sakshi

ఆ పాపం ప్రజలదే: అశోక్‌బాబు

విభజన కోరుకున్న నేతలను గెలిపిస్తే ఆ పాపం ప్రజలదే అవుతుందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: సోనియా గాంధీ తన పుట్టినరోజున తెలంగాణ బిల్లును ప్రకటించిందని, ఈ రోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్లమెంట్‌లో విభజన బిల్లుపై చర్చకు తావిస్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. పుట్టినరోజుకు బహుమతులు ఇవ్వాలనుకుంటే ప్రాజెక్టులు ఇవ్వండి, రాష్ట్రాలను కాదు అని ఆయన డిమాండ్ చేశారు.

రాంలీలా మైదానంలో ప్రారంభమైన ఏపీఎన్జీవోల మహాధర్నాలో అశోక్‌బాబు ప్రసంగించారు. విభజన కోరుకున్న నేతలను గెలిపిస్తే ఆ పాపం ప్రజలదే అవుతుందని వ్యాఖ్యానించారు. విభజనకు బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రాలను ముక్కలు చేసుకుంటూ పోతే దేశం నాశసనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగువాళ్ల సత్తా ఢిల్లీకి చాటాలని అశోక్బాబు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement