breaking news
Delhi Ramleela Ground
-
Farmers movement: ఉద్యమం మరింత ఉధృతం
న్యూఢిల్లీ: రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇందుకు ఢిల్లీ రామ్‌లీలా మైదాన్‌లో గురువారం జరిగిన ‘ కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్’ వేదికైంది. ఈ మహాపంచాయత్‌కు భారీ సంఖ్యలో రైతులు తరలివచ్చారు. 2021లో ఢిల్లీ సరిహద్దుల వెంట నెలల తరబడి ఉద్యమం, కేంద్రం తలొగ్గి వివాదాస్పద మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకున్నాక ఢిల్లీలో జరిగిన అతిపెద్ద రైతు సభ ఇదే కావడం విశేషం. సాగు, ఆహారభద్రత, సాగుభూమి, రైతు జీవనం పరిరక్షణే పరమావధిగా, మోదీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలంటూ చేసిన తీర్మానాన్ని రైతు సంఘాలు ఆమోదించాయి. రైతు సంఘాల ఉమ్మడి వేదిక అయిన సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) అధ్వర్యంలో ఈ భారీసభ జరిగింది. ట్రాక్టర్లు తీసుకురావద్దని, శాంతియుత సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వడంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే లోక్‌సభ ఎన్నికల పూర్తయ్యేదాకా తమ ఉద్యమం కొనసాగిస్తామని రైతులు తీర్మానంలో స్పష్టంచేశారు. ‘ ఈ ఉద్యమం ఆగదు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరిస్తుంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మాతో చర్చించాల్సిందే’ అని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ అన్నారు. -
ఢిల్లీలో 50వేల మందితో ‘కిసాన్ గర్జన’.. మరో రైతు ఉద్యమానికి సన్నాహమా?
న్యూఢిల్లీ: వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో నెలలతరబడి వేలాది మంది రైతులు ఆందోళన చేసిన విషయం తెలిసింది. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు ఆందోళన విరమించుకున్నారు. కానీ, కేంద్రం వైఖరిపై ఎప్పటికప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో సోమవారం సుమారు 50వేల మంది రైతులు సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ అనుబంధ రైతు సంఘం భారతీయ కిసాన్ సంఘ్ పిలుపు ఇచ్చిన ‘కిసాన్ గర్జన’ ర్యాలీ కోసం ఢిల్లీ రామ్‌లీలా మైదానానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు రైతులు. రైతుల పరిస్థితులను మెరుగుపరిచేందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రైతు రుణాల మాఫీ, పంటలకు సరైన ధర, పాడైన పంటలకు పరిహారం వంటి డిమాండ్లతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ సమావేశం రైతలు బలాన్ని సూచిస్తుందని పలువురు తెలిపారు. మరోవైపు.. సాగు చట్టాల రద్దు సమయంలో రైతుల డిమాండ్లు తీరుస్తామని కేంద్ర ప్రభుత్వ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీల అమలును గుర్తు చేసినట్లవుతోందన్నారు. బీకేఎస్ డిమాండ్లలో ప్రధానమైనవి.. ► అన్ని పంట ఉత్పత్తులపై లాభదాయకమైన ధరలు ► పంట ఉత్పత్తులపై ఎలాంటి జీఎస్టీ ఉండకూడదు ► కిసాన్ సమ్మాన్ నిధి కింద అందిస్తున్న సాయాన్ని పెంచడం ► జన్యుపరంగా మార్పు చేసిన ఆవాల విత్తనాలకు అనుమతులు ఇవ్వకూడదు ► రైతు అనుకూల ఎగుమతి, దిగుమతులు విధానాన్ని రూపొందించటం ► 15 ఏళ్ల వాహనాల తక్కు పాలసీ నుంచి రైతుల ట్రాక్టర్లకు మినహాయింపు ఇవ్వడం కాంగ్రెస్ హెచ్చరిక.. దేశ రాజధానిలో మరోసారి భారీ స్థాయిలో రైతులు సమావేశం కావడంపై హెచ్చరికలు చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఓ సలహా ఇచ్చారు. గతంలో జరిగిన విషయాల నుంచి నేర్చుకుని భవిష్యత్తులో మళ్లీ ఎదురవకుండా చూసుకోవాలన్నారు. రైతుల సమస్యపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాల్సిన సమయం ఇదేనని, లేదంటే వారు మరోసారి ఆందోళనలకు పిలుపునిచ్చే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు.. గతంలో రైతుల ఆందోళనలతో ఎదురైన ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కిసాన్ గర్ణన వేళ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రామ్‌లీలా మైదనానికి వెళ్లే దారులను మళ్లించారు. మహరాజ్ రంజీత్ సింగ్ మార్గ్, మిర్దార్ద్ చౌక్, మింటో రోడ్, అజ్మేరి గేట్, ఛమన్‌లాల్ మార్గ్, ఢిల్లీ గేట్ వంటి మార్గాల్లో ట్రాఫిక్‌ను మళ్లించారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలను అమలులోకి తీసుకొచ్చారు. ఇదీ చదవండి: కర్ణాటక అసెంబ్లీ తొలిరోజున సరిహద్దులో ఉద్రిక్తత.. బెళగావిలో 144 సెక్షన్ అమలు -
ఆ పాపం ప్రజలదే: అశోక్‌బాబు
న్యూఢిల్లీ: సోనియా గాంధీ తన పుట్టినరోజున తెలంగాణ బిల్లును ప్రకటించిందని, ఈ రోజు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా పార్లమెంట్లో విభజన బిల్లుపై చర్చకు తావిస్తోందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. పుట్టినరోజుకు బహుమతులు ఇవ్వాలనుకుంటే ప్రాజెక్టులు ఇవ్వండి, రాష్ట్రాలను కాదు అని ఆయన డిమాండ్ చేశారు. రాంలీలా మైదానంలో ప్రారంభమైన ఏపీఎన్జీవోల మహాధర్నాలో అశోక్‌బాబు ప్రసంగించారు. విభజన కోరుకున్న నేతలను గెలిపిస్తే ఆ పాపం ప్రజలదే అవుతుందని వ్యాఖ్యానించారు. విభజనకు బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రాలను ముక్కలు చేసుకుంటూ పోతే దేశం నాశసనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగువాళ్ల సత్తా ఢిల్లీకి చాటాలని అశోక్‌బాబు పిలుపునిచ్చారు.