కెనరా బ్యాంకు వెబ్సైట్ హ్యక్ | Pakistan-based hacker defaces Canara Bank site, tries to block e-payments | Sakshi
Sakshi News home page

కెనరా బ్యాంకు వెబ్సైట్ హ్యక్

Aug 11 2016 3:11 PM | Updated on Aug 27 2019 4:29 PM

పాకిస్తాన్ కు చెందిన ఓ హ్యాకర్ కెనరా బ్యాంక్ వెబ్ సైటును హ్యాక్ చేశాడు.

ముంబై: జాతీయ బ్యాంకుల్లో ఒకటైన కెనరా బ్యాంకు వెబ్ సైటు ఈ నెల 2వ తేదిన హ్యాకింగ్ కు గురైంది. పాకిస్తాన్ కు చెందిన ఓ హ్యాకర్ బ్యాంకు వెబ్ సైట్ హోం పేజీ రూపాన్ని మార్చేశాడు. పేజీలో తన పేరు ఫైసల్ గా పేర్కొన్నాడు. భారత ప్రభుత్వానికి చెందిన వెబ్ సైట్ పై ఫైసల్ 1337 తన ముద్ర పడిందని రాశాడు. భద్రత కావాలంటే ఫేస్ బుక్ లో తనపేజీని సందర్శించాలంటూ.. పాకిస్తాన్  జిందాబాద్ అని కామెంట్లు పెట్టాడు.

వెబ్ సైట్ హ్యాక్ కు గురవడంతో చర్యలు చేపట్టిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) స్విఫ్ట్ ద్వారా అకౌంట్లలోని డబ్బును చెక్ చేసింది. స్విఫ్ట్ మెసేజింగ్ సర్వీసు ద్వారా ప్రతిరోజూ వేల కోట్ల డాలర్లు బ్యాంకుల మధ్య మారుతుంటాయి. వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన ఫైసల్ ఈ-పేమెంట్లను అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. వెబ్ సైట్ హ్యాంకింగ్ కు గురైందని తెలిసిన వెంటనే సర్వర్ ను నిలిపివేసినట్లు కెనరా బ్యాంకు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

యూజర్లు వినియోగించేందుకు వీలుగా ప్రత్యేక స్టాండ్ బై సర్వర్ ను హ్యాక్ కు గురైన వెబ్ సైట్ స్థానంలో వినియోగించినట్లు చెప్పారు. బ్యాంకు వెబ్ సైట్ ను హ్యాక్ చేసి కొత్త పేజీని ఆ స్థానంలో ఉంచేందుకు కొత్త యూఆర్ఎల్ ను హ్యాకర్ వాడినట్లు వివరించారు. బ్యాంకుకు చెందిన సమాచారాన్ని వారు దొంగిలించలేదని వెల్లడించారు. కాగా స్వతంత్ర దినోత్సవానికి ముందు గతేడాది కూడా రెండు ప్రైవేట్ బ్యాంకులు, ఓ ప్రభుత్వ బ్యాంకు వెబ్ సైట్ లు హ్యాకింగ్ కు గురయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement