భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటుదారుడిని సరిహద్దు భద్రత దళాలు కాల్చి చంపాయి.
న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద చొరబాటుదారుడిని సరిహద్దు భద్రత దళాలు కాల్చి చంపాయి. మంగళవారం పంజాబ్‌లోని పటాన్‌కోట్ బమియల్ సెక్టార్‌లో ఈ ఘటన జరిగింది.
సరిహద్దు వద్ద గస్తీ నిర్వహిస్తున్న జవాన్లు జరిపిన కాల్పుల్లో చొరబాటుదారుడు అక్కడికక్కడే మరణించినట్టు అధికారులు చెప్పారు. పాకిస్థాన్ నుంచి భారత భూభాగంలోకి అక్రమంగా వచ్చాడని తెలిపారు. గతేడాది పాకిస్తాన్ నుంచి చొరబడిన ఉగ్రవాదులు ఇదే ప్రాంతంలో ఎయిర్‌ఫోర్స్ స్థావరంపై దాడి చేశారు.