పాక్‌తో యుద్ధానికి భారత్‌ రెడీగా ఉండాలి | Pak Army takes over govt, says Subramanian Swamy | Sakshi
Sakshi News home page

పాక్‌తో యుద్ధానికి భారత్‌ రెడీగా ఉండాలి

Nov 7 2016 11:28 AM | Updated on Sep 4 2017 7:28 PM

పాక్‌తో యుద్ధానికి భారత్‌ రెడీగా ఉండాలి

పాక్‌తో యుద్ధానికి భారత్‌ రెడీగా ఉండాలి

బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌ సైన్యం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి పాలనను తమ చేతుల్లోకి తీసుకుంటుందని అన్నారు. పాకిస్థాన్‌ సైన్యం నిరంతరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, దీన్నిబట్టి పాక్‌ తో మనకు యుద్ధం జరగవచ్చని సంకేతాలుగా భావించాలని చెప్పారు. పాక్‌తో యుద్ధానికి మనం సన్నద్ధంగా ఉండాలని స్వామి పేర్కొన్నారు.

యుడీ ఉగ్రదాడి అనంతరం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ‍్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్‌ దాడులు చేసిన తర్వాత పాకిస్థాన్‌ 100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. నిత్యం కాల్పులు జరుపుతున్న పాక్‌కు భారత సైన్యం దీటైన జవాబిస్తోంది. సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక‍్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరు వైపులా ప్రాణ నష్టం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement