సరి కొత్త ఓటర్లు 2 కోట్ల మంది!! | Over 2 crore voters aged between 18 and 19, declares election commission | Sakshi
Sakshi News home page

సరి కొత్త ఓటర్లు 2 కోట్ల మంది!!

Feb 20 2014 1:14 PM | Updated on Aug 14 2018 4:32 PM

సరి కొత్త ఓటర్లు 2 కోట్ల మంది!! - Sakshi

సరి కొత్త ఓటర్లు 2 కోట్ల మంది!!

దేశంలో దాదాపు 2 కోట్ల మందికి పైగా ఓటర్లు 18-19 ఏళ్ల మధ్యవారేనని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.

దేశంలో దాదాపు 2 కోట్ల మందికి పైగా ఓటర్లు 18-19 ఏళ్ల మధ్యవారేనని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. మొత్తం దేశంలో 81.46 కోట్ల మంది ఓటర్లుండగా, వాళ్లలో 2.31 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్ల లోపువారేనని తెలిపింది. అంటే దాదాపు దేశంలోని మొత్తం ఓటర్లలో 3 శాతం మంది యువత, సరికొత్త ఓటర్లేనన్నమాట. మొత్తం 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని మదించి ఈ వివరాలను ఈసీ వెల్లడించింది.

అన్నింటికంటే దాద్రా నగర్ హవేలీలో ఎక్కువ మంది యువ ఓటర్లున్నారు. ఇక్కడ 9.8 శాతం మంది ఓటర్లు యువతీ యువకులే. తర్వాతి స్థానంలో 9.03 శాతంతో జార్ఖండ్ నిలిచింది. అన్నింటికంటే తక్కువగా అండమాన్ నికోబార్ దీవుల్లో 1.1 శాతం మంది యువ ఓటర్లున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement