ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ అనుచిత ప్రవర్తన | Ola Cab driver Arun Tiwari arrested in Mumbai | Sakshi
Sakshi News home page

మహిళా ప్యాసింజర్‌ను చూస్తూ వికృత చేష్ట..

Aug 9 2017 11:08 AM | Updated on Sep 17 2017 5:21 PM

ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ అనుచిత ప్రవర్తన

ఓలా క్యాబ్‌ డ్రైవర్‌ అనుచిత ప్రవర్తన

తన క్యాబ్‌లో ప్రయాణిస్తోన్న మహిళా ప్యాసింజర్‌ను చూస్తూ, ఆమె ముందు వికృత చేష్టకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు.

- మహిళా ప్యాసింజర్‌ను చూస్తూ వికృత చేష్ట
- నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు


ముంబై:
మొన్నటి కిడ్నాప్‌ ఉదంతం మర్చిపోకముందే.. ప్రఖ్యాత ఓలా సంస్థకు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ దురాగతం మరొకటి వెలుగులోకి వచ్చింది.

తన క్యాబ్‌లో ప్రయాణిస్తోన్న మహిళా ప్యాసింజర్‌ను చూస్తూ, ఆమె ముందు వికృత చేష్టకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు.

ముంబైకి చెందిన ఓ మహిళ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు ఓలా క్యాబ్‌ను బుక్‌ చేసుకుంది. క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్‌ అరుణ్‌ తివారి.. ఆమె వైపే చూస్తూ వికృతచర్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన ప్రయాణికురాలు.. వెంటనే కారు దిగి పోలీసులకు ఫోన్‌ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు క్యాబ్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement