వాట్సాప్‌: అభ్యంతరకర ఫొటో.. ఇద్దరిపై కేసు | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌: అభ్యంతరకర ఫొటో.. ఇద్దరిపై కేసు

Published Tue, Sep 5 2017 9:23 AM

వాట్సాప్‌: అభ్యంతరకర ఫొటో.. ఇద్దరిపై కేసు - Sakshi

సాక్షి, ముజఫర్‌నగర్‌: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను అభ్యంతరకరంగా మార్ఫింగ్‌ చేసి.. వాట్సాప్‌లో పోస్టు చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఇందులో ఒకరు వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మినిస్ట్రేటర్‌ కాగా, మరొకరు ఫొటోను పోస్టు చేసిన వ్యక్తి. ఐపీసీ సెక్షన్‌ 505 (ఒక వర్గాన్ని లేదా ఒక వ్యక్తిని రెచ్చగొట్టే ఉద్దేశంతో వ్యవహరించడం, వర్గం మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం), ఐటీ చట్టం కింద అభియోగాలు నమోదుచేశారు.

వాట్సాప్‌లో ప్రధాని మోదీ ఫొటోను అభ్యంతరకరంగా మార్ఫింగ్‌ చేసి.. సర్క్యులేట్‌ చేయడంపై స్థానిక బీజేపీ నేత యోగేందర్‌ చౌదరి ఆందోళన నిర్వహించి.. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇందుకు కారణమైన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదుచేశారు.

Advertisement
Advertisement