దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్అవుతున్నాయి. ఫ్లాట్ గా అరంభమైన మార్కెట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి.
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ట్రేడ్అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో ఫ్లాట్ గా అరంభమైన మార్కెట్లు క్రమంగా పుంజుకుంటున్నాయి. సెన్సెక్స్ 34 పాయింట్ల లాభంతో 26,679 వద్ద, నిఫ్టీ 13 పాయింట్ల లాభంతో 8,206 వద్ద ట్రేడ్ అవుతనున్నాయి. ప్రధానంగా టెలికాం కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. ఆటో లాభాల్లో టాటా మోటార్స్ టాప్ విన్నర్ గా ఉంది. ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి, కోల్ ఇండియా పవర్ గ్రిడ్ లాభాల్లో, హెచ్ యూఎలె, ఐటిసి నష్టాల్లో ఉన్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ టెహ్ అగ్ర స్థానంలో నిలిచింది.
అటుడాలర్ మారకపు విలువలో మంగళవారం రూపాయి భారీగా నష్టాలతో ముగిసింది. రూ.68 దిగువకు పడిపోయి రూ.68.22 వద్ద ముగిసింది. అయితే బుధవారం రూపాయి 12 పైసలు లాభంతో ఉంది.