పోయిన జ్ఞాపకాలను తిరిగి తెప్పిస్తుంది... | New DARPA Project Could Use Brain Implants to Restore Memory | Sakshi
Sakshi News home page

పోయిన జ్ఞాపకాలను తిరిగి తెప్పిస్తుంది...

May 5 2014 2:28 AM | Updated on Sep 2 2017 6:55 AM

పోయిన జ్ఞాపకాలను తిరిగి తెప్పిస్తుంది...

పోయిన జ్ఞాపకాలను తిరిగి తెప్పిస్తుంది...

మెదడుకు గాయమైతే గత జ్ఞాపకాలు చెరిగిపోతాయి. అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చినా.. వ్యక్తులు, సంఘటనలు, అంకెల వంటి పలు విషయాలను మరిచిపోతారు.

మెదడుకు గాయమైతే గత జ్ఞాపకాలు చెరిగిపోతాయి. అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చినా.. వ్యక్తులు, సంఘటనలు, అంకెల వంటి పలు విషయాలను మరిచిపోతారు. అలాంటి వారికి జ్ఞాపకాలను తిరిగి తెప్పించే ఓ మెమరీ స్టిమ్యులేటర్‌ను త్వరలో అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించనున్నారు. మనిషి మెదడును మరింత బాగా అర్థం చేసుకునేందుకు చేపట్టిన ‘అధ్యక్షుడు బరాక్ ఒబామా 10 కోట్ల డాలర్ల(రూ.601.6 కోట్ల) కార్యక్రమం’లో భాగంగా డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ(డార్పా) శాస్త్రవేత్తలు దీనిని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం వ్యక్తులను గుర్తుపట్టడం, సంఘటనలు, విషయాలను గుర్తుకు తెచ్చుకోవడం వంటి నిర్ణయాత్మక జ్ఞాపకాలను కోల్పోతే.. తిరిగి తెప్పించడం సాధ్యం కావడం లేదు.

 

అయితే మెదడులో జ్ఞాపకశక్తి ఏర్పడటం, నిర్వహణ, నిక్షిప్తానికి సంబంధించిన హిప్పోకాంపస్ భాగాన్ని ఇలాంటి పరికరాలతో ప్రేరేపిస్తే.. నిర్ణయాత్మక జ్ఞాపకాలనూ తిరిగి తేవచ్చని డార్పా పరిశోధకులు చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement