breaking news
DARPA Project
-
మెదడును కంప్యూటర్‌తో అనుసంధానం..
ఇప్పుడున్న టెక్నాలజీ రంగంలో మనిషి ఆలోచనలు కూడా సూపర్‌ఫాస్ట్ అయిపోయాయి.అయితే మన ఆలోచనలు ఆచరణ రూపం దాల్చడానికి కొంత టైం పడుతుంది. లైట్ వేయాలంటే స్విచ్ దగ్గరకు వెళ్లాలి.. లేదంటే రిమోట్నైనా వాడాలి. కానీ ఇవేవీ లేకుండా మీరు మనసులో ఓ మాట అనుకోవడమే తడవు పనులు జరిగిపోతే ఎలా ఉంటుంది. అబ్బో ఊహించలేనన్ని అద్భుతాలు సాధ్యమవుతాయి! ప్రస్తుతం అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ విభాగం డార్పా ఈ దిశగా అడుగులు వేస్తోంది. ‘నెక్ట్స్ జనరేషన్ నాన్ సర్జికల్ న్యూరో టెక్నాలజీ ప్రోగ్రాం’పేరుతో ఈ సరికొత్త ప్రాజెక్టుకు ఏడాది క్రితమే శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన విశేషాలు తెలియాలంటే కింది వీడియోని క్లిక్ చేయండి. -
పోయిన జ్ఞాపకాలను తిరిగి తెప్పిస్తుంది...
మెదడుకు గాయమైతే గత జ్ఞాపకాలు చెరిగిపోతాయి. అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చినా.. వ్యక్తులు, సంఘటనలు, అంకెల వంటి పలు విషయాలను మరిచిపోతారు. అలాంటి వారికి జ్ఞాపకాలను తిరిగి తెప్పించే ఓ మెమరీ స్టిమ్యులేటర్‌ను త్వరలో అమెరికా శాస్త్రవేత్తలు ఆవిష్కరించనున్నారు. మనిషి మెదడును మరింత బాగా అర్థం చేసుకునేందుకు చేపట్టిన ‘అధ్యక్షుడు బరాక్ ఒబామా 10 కోట్ల డాలర్ల(రూ.601.6 కోట్ల) కార్యక్రమం’లో భాగంగా డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ(డార్పా) శాస్త్రవేత్తలు దీనిని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం వ్యక్తులను గుర్తుపట్టడం, సంఘటనలు, విషయాలను గుర్తుకు తెచ్చుకోవడం వంటి నిర్ణయాత్మక జ్ఞాపకాలను కోల్పోతే.. తిరిగి తెప్పించడం సాధ్యం కావడం లేదు. అయితే మెదడులో జ్ఞాపకశక్తి ఏర్పడటం, నిర్వహణ, నిక్షిప్తానికి సంబంధించిన హిప్పోకాంపస్ భాగాన్ని ఇలాంటి పరికరాలతో ప్రేరేపిస్తే.. నిర్ణయాత్మక జ్ఞాపకాలనూ తిరిగి తేవచ్చని డార్పా పరిశోధకులు చెబుతున్నారు.