ఆరు నిమిషాల్లో బ్యాటరీ ఫుల్ | New battery can charge cellphones in 6 minutes | Sakshi
Sakshi News home page

ఆరు నిమిషాల్లో బ్యాటరీ ఫుల్

Aug 24 2015 12:33 AM | Updated on Sep 3 2017 8:00 AM

ఆరు నిమిషాల్లో బ్యాటరీ ఫుల్

ఆరు నిమిషాల్లో బ్యాటరీ ఫుల్

మీరు అర్జెంట్‌గా ఫోన్ మాట్లాడుతున్నారు. అదే సమయంలో బ్యాటరీ చార్జ్ అయిపోయి ఫోన్ ఆఫ్ అయిపోతే ఎలా అనిపిస్తుంది?

లండన్: మీరు అర్జెంట్‌గా ఫోన్ మాట్లాడుతున్నారు. అదే సమయంలో బ్యాటరీ చార్జ్ అయిపోయి ఫోన్ ఆఫ్ అయిపోతే ఎలా అనిపిస్తుంది? చేతిలో ఉన్న ఫోన్‌ను తీసి విసిరి కొట్టాలనిపిస్తోంది కదా! అయితే మీలాంటి వారి కోసమే కేవలం ఆరే ఆరు నిమిషాల్లో ఫుల్ చార్జ్  అయ్యే బ్యాటరీ ఉందండి.  అల్యూమినియంతో నిండిన క్యాప్సుల్స్ మీ సెల్‌ఫోన్‌ను ఆరు నిమిషాల్లో చార్జ్ చేస్తుంది. ప్రస్తుతమున్న లిథియం అయాన్ బ్యాటరీ కంటే దీనికి 4 రెట్లు సామర్థ్యం అధికంగా ఉండడమే కాదు, చార్జింగ్ తర్వాత ఎక్కువ సమయం వాడుకునే వీలుంటుంది.

లిథియం బ్యాటరీలో అల్యూమినియం వాడకం విషయంలో తలెత్తిన సమస్యలను అధిగమిస్తూ  బీజింగ్‌లోని మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సింగ్వా యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని రూపొందించారు. ఇందులో  అల్యూమినియం చుట్టూ టైటానియం డై ఆక్సైడ్ కవచం ఉంటుంది. ఈ కవచం బ్యాటరీ రుణాత్మక ఎలక్ట్రోడ్‌గా పనిచేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement