బాలీవుడ్ నటి హత్య కేసులో మరో మలుపు | Nadir Shah Patel is not Laila Khan's biological father, cops tell court | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ నటి హత్య కేసులో మరో మలుపు

Jan 9 2014 6:01 PM | Updated on Apr 3 2019 7:03 PM

బాలీవుడ్ నటి హత్య కేసులో మరో మలుపు - Sakshi

బాలీవుడ్ నటి హత్య కేసులో మరో మలుపు

సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసు మరో అంశం వెలుగులోకి వచ్చింది.

ముంబై: సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసు మరో అంశం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు లైలా ఖాన్ తండ్రిగా చెలామణి అవుతున్న నాదిర్ షా పటేల్ ఆమె సొంత తండ్రి కాదని వెల్లడయింది. లైలా ఖాన్, ఆమె తోబుట్టువులు ఆయనకు జన్మించిన వారు కాదని డీఎన్ఏ పరీక్షలో నిర్ధారణయింది. డీఎన్ఏ నివేదికను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు బుధవారం కోర్టుకు సమర్పించారు.

లైలా ఖాన్తో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఐదుగురిని 2011లో దారుణంగా కాల్చి చంపారు. ఈ ఆరు మృతదేహాలు పోలీసుల వద్ద ఉన్నాయి. అంత్యక్రియలు నిర్వహించేందుకు తన వారి భౌతికాయాలు తనకు అప్పగించాలని  నాదిర్ షా గత నెలలో  సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. అంతకుముందు మృతదేహాలను తీసుకునేందుకు అతడు నిరాకరించాడు. కాగా, ఈ ఆరు హత్యలు లైలా ఖాన్ సవతి తండ్రి పర్వేజ్ తక్ చేసినట్టు 2012, అక్టోబర్ 3న పోలీసులు చార్జిషీట్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement