ఆరుకు చేరిన ముంబై మృతుల సంఖ్య | Mumbai building collapse, death toll climbs to six | Sakshi
Sakshi News home page

ఆరుకు చేరిన ముంబై మృతుల సంఖ్య

Mar 14 2014 6:31 PM | Updated on Sep 2 2017 4:42 AM

ముంబై శాంతాక్రాజ్ శివారులోని వకోలాలో ఏడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది.

ముంబై : ముంబై శాంతాక్రాజ్ శివారులోని వకోలాలో ఏడంతస్థుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. శుక్రవారం ఉదయం భారీ భవనం కూలిపోవడంతో శిధిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కూలిన ఆ భవనంలో ఎవరు నివసించడం లేదని బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు వెల్లడించారు.అయితే కుప్పకూలిన భవనం మురికవాడ పక్కన ఉందని శిథిలాల కింద కొంత మంది చిక్కుకున్నారు.
 

ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బృహన్ ముంబై మున్సిపల్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బృహన్ మున్సిపల్ కార్పోరేష్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement