రూ.8000 కోట్లు కోల్పోయిన అంబానీ | Mukesh Ambani gas pipeline company's net worth erodes by Rs 8,000 crore | Sakshi
Sakshi News home page

రూ.8000 కోట్లు కోల్పోయిన అంబానీ

Feb 14 2017 9:24 AM | Updated on Sep 5 2017 3:43 AM

రూ.8000 కోట్లు కోల్పోయిన అంబానీ

రూ.8000 కోట్లు కోల్పోయిన అంబానీ

టెలికాం ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తూ దిగ్గజ కంపెనీ ఆదాయాలకు భారీగా గండికొడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి భారీ షాక్ తగిలింది.

టెలికాం ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టిస్తూ దిగ్గజ కంపెనీ ఆదాయాలకు భారీగా గండికొడుతున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి భారీ షాక్ తగిలింది. తన ప్రముఖ రిలయన్స్ గ్యాస్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(ఆర్జీటీఐఎల్) 2016 సెప్టెంబర్ వరకు రూ.8000 కోట్ల మేర నికర ఆదాయాన్ని కోల్పోయింది. ఆర్ఐఎల్ క్రిష్ణా గోదావరి బేసిన్ ద్వారా తక్కువ గ్యాస్ సప్లై అవుతుండటంతో కంపెనీ ఈ నష్టాలను మూటకట్టుకుంది. క్రిష్ణా గోదావరి బేసిన్ నుంచి గుజరాత్కు కనెక్ట్ అయిన 1400 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్లైన్ను కంపెనీ కలిగిఉంది.
 
ఆర్ఐఎల్ కేజీ బేసిన్లో ఉత్పత్తిచేసే గ్యాస్ ద్వారా కంపెనీ రెవెన్యూలను ఆర్జిస్తుంది. అయితే 2016 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర ఆదాయం రూ.2641 కోట్లు నెగిటివ్గా ఉన్నట్టు  రిలయన్స్ గ్యాస్ ఫైలింగ్లో తెలిసింది. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ను పాటిస్తూ ఈ నికర ఆదాయాల ప్రకటనను తయారుచేశామని కంపెనీ చెప్పింది. 2010 నుంచి కంపెనీ ఒక్కసారి మాత్రమే లాభాలను ఆర్జించింది. ప్రిఫరెన్స్ షేర్ల ద్వారా కంపెనీ రూ.4000 కోట్లను ఆర్జించాలని యోచిస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement