డ్రగ్స్‌ కేసు : హైదరాబాద్‌ చేరుకున్న ముమైత్‌ | momaith khan to appear before SIT | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ కేసు : హైదరాబాద్‌ చేరుకున్న ముమైత్‌

Jul 26 2017 10:24 PM | Updated on Nov 6 2018 4:42 PM

డ్రగ్స్‌ కేసు : హైదరాబాద్‌ చేరుకున్న ముమైత్‌ - Sakshi

డ్రగ్స్‌ కేసు : హైదరాబాద్‌ చేరుకున్న ముమైత్‌

తెలుగు సినీ పరిశ్రమను కలవరపెడుతున్న డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో మరో కీలక పరిణామం.

హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమను కలవరపెడుతున్న డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో మరో కీలక పరిణామం. ఇప్పటివరకు ఆరుగురు సినీ ప్రముఖులను ప్రశ్నించిన ఎక్సైజ్‌ సిట్‌ అధికారులు గురువారం సినీ నటి ముమైత్‌ఖాన్‌ను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె గురువారం సిట్‌ విచారణకు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు ఆమె విచారణకు హాజరుకానున్నారు.ఇందుకోసం ఆమె బుధవారం పుణె నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.

ప్రస్తుతం మొమైత్‌ఖాన్‌  బిగ్‌బాస్‌ షోలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ షో నిబంధనల ప్రకారం ఆమె అర్ధంతరంగా బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు రావడానికి వీలు లేకపోయినా డ్రగ్స్‌ కేసు తీవ్రత దృష్ట్యా ఆమెకు ఈ వెసులుబాటు కల్పించినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం తిరిగి ఆమె షోలో పాల్గొంటారా లేదా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్‌ కేసులో ఇప్పటివరకు దర్శకుడు పూరీ జగన్నాథ్‌, శ్యాం కే నాయుడు, తరుణ్‌, నవదీప్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, చార్మి తదితరులు సిట్‌ విచారించిన సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల వినియోగానికి సబంధించి లోతుగా సాగుతున్న సిట్‌ విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement