సినీ తారలకు మోదీ పిలుపు | Modi asks actors, youths to popularise handloom | Sakshi
Sakshi News home page

సినీ తారలకు మోదీ పిలుపు

Aug 7 2015 4:02 PM | Updated on Aug 15 2018 2:20 PM

సినీ తారలకు మోదీ పిలుపు - Sakshi

సినీ తారలకు మోదీ పిలుపు

సినిమా తారలు, యువత చేనేత ఉత్పత్తులు వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

చెన్నై: సినిమా తారలు, యువత చేనేత ఉత్పత్తులు వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలను వాడటం ద్వారా ఈ రంగానికి ప్రాచుర్యం కల్పించాలని కోరారు. శుక్రవారం చెన్నైలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో మోదీ పాల్గొన్నారు.

మద్రాస్ యూనివర్సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. 'సినిమా నటులు తమ ప్రతి ఐదు సినిమాల్లో ఒక చిత్రంలో చేనేత, చేతి ఉత్పత్తులు వాడితే.. ఈ సినిమాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తాయి. ఫ్యాషన్కు ప్రాచుర్యం కల్పించడంలో సినీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుంది' అని అన్నారు. ప్రస్తుతం యువత ఎక్కువగా ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేస్తున్నారని, చేనేత వస్త్రాలను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. మార్కెట్లో చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరముందని మోదీ అన్నారు. చెన్నైకు వచ్చిన మోదీకి విమానాశ్రయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత స్వాగతం పలికారు. జయ ఆహ్వానం మేరకు మోదీ ఆమె నివాసానికి విందుకు వెళ్లారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement